కొద్ది రోజుల క్రితం యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డి అరెస్టయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బెయిల్ మీద విడుదల అయ్యారు.. ఈ క్రమంలోనే యాంకర్ శ్యామల సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆయన వీడియో విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా మీడియా వేదికగా తన గురించి జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ వేయడానికి వీడియో చేస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. మరో రెండు మూడు రోజుల్లో పూర్తి ఆధారాలతో మొత్తం కేస్ స్టడీతో సహా మీడియా ముందుకు వస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఇది పూర్తిగా తప్పుడు కేసు అని ఆరోపించిన ఆయన దానికి నిదర్శనం తాను రెండు రోజుల్లోనే బెయిల్ మీద విడుదల కావడం అని అన్నారు. 

నిజంగా ఆమె ఆరోపించినట్లు తాను చేసి ఉంటే బెయిల్ లభించేది కాదు అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రోజుల్లో ఆరోపణలు రావడం సహజమేనని పేర్కొన్న ఆయన దానిని నుంచి తాను తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా తన మీద ఉందని చెప్పుకొచ్చారు.  హైదరాబాద్ కి చెందిన ఒక మహిళ నరసింహారెడ్డి తనను మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 


గండిపేట వద్ద తనకు 100 కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమి ఉందని అందులో థీం పార్క్, రిక్రియేషన్  సెంటర్ కట్టాలన్న ఆలోచన ఉందని చెబుతూ నరసింహారెడ్డి తన వద్ద డబ్బు తీసుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 2017 నుంచి పలు దఫాలుగా సుమారు కోటి రూపాయల సొమ్ము అతనికి అప్పుగా ఇచ్చానని డబ్బు తీసుకున్నాక అతను ఎలాంటి డెవలప్మెంట్ చేయకపోవడంతో డబ్బు తిరిగి అడిగానని ఆమె చెప్పుకొచ్చింది. ఆ డబ్బు ఇవ్వకపోగా తిరిగి బెదిరింపులకు దిగడం తరువాత అతని సోదరి అని చెప్పుకుంటూ మరో మహిళ రాయబారం నడవడానికి వచ్చిందని ఆమె ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నేపథ్యంలో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో నరసింహా రెడ్డి కి బెయిల్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: