సినిమా ఇండస్ట్రీలో రోజూ ఏదో ఒక విషాద వార్త బయటకు వస్తూనే ఉంది. ఒకదాన్ని మించి మరో విషాదం చోటు చేసుకుంటున్నాయి. ప్రతి రోజూ సినీ ప్రముఖులు ఎవరో ఒకరి మనకు దూరం అవుతున్నారు. అందులో చాలా మంది కరోనా కాటుకు బలైపోతుంటే, మరికొందరు ఇతర ఇతర కారణాలతో మరణిస్తున్నారు. నిన్న తెలుగు జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ మరణ వార్త ఇంకా జీర్ణించుకోలేక ముందే మరో మరణవార్త వినాల్సి వచ్చింది. ఈ సారి లెజెండరీ రైటర్,
డైరెక్టర్ కన్నుమూశారు.
ఆయన మలయాళ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కన్నుమూశారు. ఆయన పేరు డెన్నిస్ జోసెఫ్. కొట్టాయం హాస్పిటల్‌లో గుండెపోటుతో మరణించారు జోసెఫ్. మలయాళ సినిమాకు 35 ఏళ్లుగా ఎనలేని సేవలు అందిస్తున్న లెజెండరీ రైటర్ జోసెఫ్ 1985 లో తన
సినిమా ప్రస్థానం మొదలు పెట్టారు. 2021 వరకు ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. 35 ఏళ్ల వ్యవధిలో దాదాపు 50 సినిమాలకు కథలు అందించిన డెన్నిస్ మలయాళ
సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఈయన రాసిన కథలు మలయాళంలో
చరిత్ర సృష్టించాయంటే అతిశయోక్తి కాదు.
మమ్ముట్టి,
మోహన్ లాల్,
సురేష్ గోపీ లాంటి స్టార్ హీరోలందరికీ కూడా ఈయన కథలు అందించారు. 1985లో వచ్చిన ఈరాన్
సంధ్య సినిమాతో ఈయన
జర్నీ మొదలైంది. 2021లో వచ్చిన
పవర్ స్టార్ సినిమా వరకు ఆయన సినిమాల్లోనే మమేకం అయ్యారు. ఆయన ఒక ఆరు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరోలు సైతం డేన్నిస్ జోసెఫ్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు.