టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తోంది. కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలతో అలరించిన అనుష్క ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలు...తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాల్లోనే నటిస్తోంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనే ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చివరగా అనుష్క నటించిన సినిమా నిశ్శబ్దం కాగా ఈ చిత్రం తరవాత వేరే సినిమా రావడం కానీ..మరో సినిమాను ప్రకటించడం కానీ చేయలేదు . అయితే కొద్ది రోజుల నుండి మాత్రం అనుష్క యంగ్ హీరో నవీన్ శెట్టికి జోడీగా నటించబోతుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది . ఈ సినిమాలో హీరో తనకంటే పెద్ద వయసున్న అమ్మాయితో ప్రేమలో పడతారట. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రారా కృష్ణయ్య మూవీ డైరెక్టర్  మహేష్ తెరకెక్కించబోతున్నారట . 

అయితే ఈ చిత్రంపై మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇదిలా ఉండగానే అనుష్క కు ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ నుండి ఓ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అనుష్క కోసం ఓ సరికొత్త కథను నెట్ ఫ్లిక్స్ రెడీ చేయించిందట . అంతే కాకుండా కథను ఓ స్టార్ డైరెక్టర్   సిద్ధం చేశారట. అంతే కాకుండా అనుష్కకు సినిమా కథ కూడా నచ్చేసిందట. అయితే అనుష్క మొదట యూవీక్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న సినిమాలో నటించి ఆ తరవాత నెట్ ఫ్లిక్స్ కోసం సినిమా చేయబోతుందట. అంతే కాకుండా ఈ సినిమాకు అనుష్క భారీగానే రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నట్టు టాక్. ఇదిలా ఉండగా ఇప్పటికే తమన్నా, సమంతా లాంటి భామలు ఓటీటీ పై సందడి చేయగా ఇప్పుడు ఆ లిస్ట్ లో మన స్వీటీ కూడా చేరబోతుంది. మరి ఓటీటీ పై అనుష్క ఎలా అలరిస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: