బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రతి రంజాన్ కు ఒక కొత్త సినిమాని విడుదల చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. గత కొన్నేళ్లుగా ఇది చేస్తూనే ఉన్నాడు కండలవీరుడు. అలా పండక్కి వచ్చిన సినిమాలు దాదాపు విజయం సాధించాయి. ఇక ఈ ఏడాది రంజాన్ కు కూడా తన సినిమాను విడుదల చేశారు భాయ్. ఈయన నటించిన రాధే సినిమా మే 13న అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రస్తుతం కరోన ఉగ్రరూపం దాల్చి రోజుకు కనీసం నాలుగు లక్షల కేసులు వచ్చే వరకూ పరిస్థితి మారిపోయింది. ఇలాంటి సమయంలో థియేటర్లలో విడుదల చేయడం సాధ్యం కావడం లేదు అంటున్నాడు సల్మాన్ ఖాన్. దాంతో కేవలం జీ5 ఓటీటీ వేదికగా రాధే సినిమా విడుదల అయింది. 

అయితే ఈ సినిమాని చూసి బాలీవుడ్ లో వివాదాస్పద రివ్యూస్ రాసే కెఆర్కె ఇలా స్పందించారు. " ఇప్పుడే రాధే సినిమా చూడటం జరిగింది. ఈ సినిమా చూశాక నాకు రివ్యూ చేసే స్థితిలో నేను లేను , మెడిసిన్ వేసుకొని ఒక రెండు మూడు గంటలు రెస్ట్ తీసుకొని రివ్యూ పోస్ట్ చేస్తాను అని" అన్నారు. ఈ పోస్ట్ చూశాక ఆయన మీద సల్మాన్ అభిమానులు ట్విట్టర్ లో విరుచుకుపడుతున్నారు. అలాగే చాలామందికి ఈ సినిమా ఇంత దారుణంగా ఉందా అనే సందేహం కూడా వస్తుంది. ఇప్పటికే ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమాకి ముందు వచ్చిన దబంద్ 3 డిజాస్టర్ అయింది. 


ఇక ఈ సినిమా కూడా సరిగ్గా హిట్ అవ్వకపోతే ఆయన పరిస్థితి ఏంటో. ఇక మెల్లగా ఇప్పుడే  ఒక్క ఒక్క రివ్యూ సోషల్ మీడియా ద్వారా బయటికి వస్తుంది. ఆ రివ్యూలు అన్ని చూస్తుంటే ఈ సినిమా హిట్ అవ్వడం చాలా కష్టంగానే కనిపిస్తుంది. ఇక ఈ సినిమా జీ5 ఓటిటి దాదాపుగా 250 కోట్లతో కొన్నారు. రాధే సినిమా అంతా లాభం తెస్తుంతో లేదో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: