ప్రతి ఒక్క మనిషి ఫుడ్ కి ఇచ్చే ప్రాధాన్యత మరేదేనికి ఇవ్వడు.. కోటివిద్యలు కూటికొరకే అన్నట్లు మనిషి ఏది చేసినా పొట్టనింపుకోవడం కోసమే కదా... అలాంటి ఫుడ్ లలో ఇప్పుడు చాలా వెరైటీలు,, ఎన్నో రకాలు.. ప్రతి ఒక్కరికి ఇష్టమైన వంటకం ఉంటుంది.. దాన్ని చేయించుకొని తినాలి అందరికి ఉంటుంది.. ఫుడ్ తినే టైం ని ఎంతో స్పెషల్ గా ట్రీట్ చేస్తూ దానికి ఇచ్చే ప్రాధాన్యత ని ఇస్తుంటారు.. అలా మన టాలీవుడ్ స్టార్ ల ఫెవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం...

సినిమాల్లో మెగా స్టార్ గా ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి భోజన ప్రియుడు.. అమ్మ చేతి వంటను ఎంతగానో ఇష్టపడే ఆయనకు  చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే ఎంతో ఇష్టమట.. పలు సందర్భాల్లో అయన ఈ వంటకాలు అంటే ఎంతో ఇస్తామని చెప్పాడు.. ఎంతటి మెగా స్టారుడు అయినా వంట విషయంలో చిన్నపిల్లాడు కావాల్సిందే.. నందమూరి బాలకృష్ణ కు రొయ్యలు అంటే ఎంతో ఇష్టమట.. చికెన్ బిర్యానీని కూడా బాలయ్య ఇష్టపడతారని తెలుస్తోంది. ఒక్క బాలయ్య అనే కాదు చాలామంది టాలీవుడ్ హీరోయిలకు బిర్యానీ ఎంతో ఇష్టంగా ఆరగిస్తారట..

మరో సీనియర్ హీరో అయినా వెంకటేష్ నోస్టాలజిక్ కీమాను ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో నోస్టాలజిక్ కీమాను ను వేసుకుని కాస్త నెయ్యి ని దట్టించి అయన ఎంతో ఇష్టంగా భుజిస్తారట.. నాగార్జున కి దోశ, చేపలు, గ్రిల్డ్ చికెన్ ,, ప్రభాస్ కి సీ ఫుడ్, రోడ్ సైడ్ పానీపూరీ, బిర్యానీ.. మహేష్ బాబు కు బిర్యానీ, చేపల పులుసు అది కూడా డైటీషియన్ సలహాల ప్రకారమే తీసుకుంటారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పప్పు, లెమన్ రైస్ అరటికాయ వేపుడు, నాటుకోడి పులుసుతో పాటు నెల్లూరు చేపల పులుసును ఎంతో ఇష్టంగా తింటారు.. రామ్ చరణ్ బిర్యానీని, రామ్ చరణ్  రోటీ, నాటుకోడి ఖీమా, బన్నీ అమ్మ చేతి వంటకాన్ని ఇష్టంగా భుజించారట..

మరింత సమాచారం తెలుసుకోండి: