
జూనియర్ సమంత గా డబ్స్మాష్ లు చేస్తూ పాపులర్ అయింది అషూ రెడ్డి. అక్కడ వచ్చిన పాపులారిటీతో టిక్ టాక్ లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పాపులర్ క్రియేటర్ గా మారింది. ఆ తర్వాత ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె దశ తిరిగింది అనే చెప్పాలి. ఒకప్పుడు చూడడానికి సమంత పోలికలతో ఉండడంతో ఆమెకు నితిన్ నటించిన చల్ మోహన్ రంగా సినిమా లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా వచ్చింది. ఇక మొత్తం మీద బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అక్కడ రచ్చ రేపింది.
అయితే హౌస్ లో పెద్దగా కాంట్రవర్సీలు ఏమీ చేయలేదు గాని బయటకు వచ్చినప్పటి నుంచి సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో అఫైర్ ఉంది అని అనిపించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుటున్నారు. ఇక కొన్ని టీవీ షోలలో ఈ భామ కనిపిస్తూ ఉంటుంది. స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రాంలో ఎక్స్ ప్రెస్ హరితో కలిసి ఈ భామ స్కిట్స్ చేస్తోంది. టిఆర్పీ కోసం వీళ్లిద్దరి మధ్య కూడా ఏదో ఉంది అని భ్రమింపచేస్తున్నారు. ఇది కాక యాంకర్ రవితో కలిసి ఈ భామ హ్యాపీడేస్ అనే షో కూడా చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ భామ తాజాగా పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. బెంజ్ కారు పక్కన బ్లాక్ డ్రెస్ లో దర్శనమిచ్చి ఆకాశం వంక చూస్తూ ఉంది.
అదే సమయంలో ధైర్యం చేసి నా పక్క సీట్లో కూర్చో జీవితం చివరి వరకు తీసుకు వెళతానని ఆ ఫోటోకి కామెంట్ పెట్టింది. అది యాదృచ్చికంగా పెట్టిందో లేక కావాలనే ఎవరికైనా హింట్ ఇవ్వడానికి పెట్టిందో తెలియదు కానీ ఈ పోస్ట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె తన ప్రియుడిని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టింది అని కొందరు కామెంట్ చేస్తుంటే ఆ ప్రియుడు ఎవరో కాదు రాహుల్ సిప్లిగంజ్ అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని వీరిద్దరూ చాలాసార్లు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.