ప్రస్తుతం ఎంతో మంది పిల్లలు లేని వారికి సొంత బిడ్డలా.. ఆపదలో ఉన్న ఆడపిల్లలకు తోడబుట్టిన అన్నలా.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు నేనున్నా అంటూ చేతిని అందించే కొడుకుల మారిపోయాడు సోనుసూద్. పంజాబ్ లో చిన్న గ్రామానికి చెందిన సోనుసూద్ ఏకంగా దేశంలోని ఎన్నో గ్రామాలకు సహాయ సహకారాలు అందించాడు. ముఖ్యంగా ప్రస్తుతం సోనూ ఉన్న సమయంలో చేస్తున్న సహాయం మాటల్లో వర్ణించలేనిది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా దేశవ్యాప్తంగా సోనుసూద్ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇటీవలే హీరోయిన్ హ్యూమా ఖురేషి కూడా ప్రశంసలు కురిపించారు.
సోను సూద్ రాజకీయాల్లోకి వచ్చి ప్రధానమంత్రి అయితే ఎంతో బాగుంటుందని.. ఇంకెంతో మంది పేదలకు సహాయ సహకారాలను అందిస్తాడు అని.. ఎంతోమంది చెబుతున్నారూ.. ఇది నిజమే అంటూ చెప్పుకొచ్చారు హ్యూమా ఖురేషి . సోను సూద్ ప్రధాన మంత్రి పదవి లోకి వస్తే ఇంకా ఎన్నో మంచి పనులు చేయగలుగుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సోను సూద్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకే తాను ఓటు వేస్తానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే సోనూ మాత్రం ఇప్పట్లో తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. ఒకవేళ వస్తే ఏ పార్టీతో ముందుకు నడుస్తారు అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి