క‌రోనా మ‌హామ్మారి బారిన ప‌డి అనేక మంది ప్ర‌జ‌లు మ‌ర‌ణిస్తున్నారు. చాలా మంది క‌రోనాబారిన ప‌డి కోలుకుంటున్నారు.క‌రోనా రెండ‌వ ద‌శ‌లో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకుంనేందుకు ప్ర‌జ‌లు ఎక్క‌వ‌గా ఆసక్తి చూపిస్తున్నారు.దీంతో పాల‌కు,గుడ్ల‌కు డిమాండ్ ఎక్కువైంది. ప్ర‌ధానంగా త‌క్కువ ధ‌ర‌లో అధిక ప్రోటీన్ ల‌భిస్తున్నందును చాలా మంది కోడిగ్రుడ్లు తినేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు.క‌రోనా రోగుల‌కు అధికంగా ఉండే ప్రోటీన్లు ల‌భించే ఆహారం ఇవ్వాల‌ని వైద్యులు సూచిస్తుండ‌టంతో అంద‌రూ గుడ్ల‌వైపే చూస్తున్నారు.క‌రోనా రెండ‌వ ద‌శో గుడ్ల వాడ‌కం ఎక్కువ‌గా పెరిగింద‌ని వ్యాపారులు అంటున్నారు.వారంలో 5 రోజుల పాటు గుడ్ల‌ను ప్ర‌జ‌లు ఎక్కువ‌గా తింటున్నారు. ప్ర‌స్తుతం ఒక్కొక్క గుడ్డు ధ‌ర ఆరు నుంచి ఏడు రుపాయ‌ల వ‌ర‌కు ప‌లుకుతోంది.గ‌తంలో 4 నుంచి 5 రూపాయ‌ల ఉన్న గుడ్డు ధ‌ర ఇప్పుడు పెరిగింది. అయితే పెరిగిన ధ‌ర‌లు వారం వారం త‌గ్గుతూ వ‌స్తుంటాయి కానీ దాదాపుగా నెల రోజులుపైగా ఇదే రేటు కొన‌సాగుతుంది.దీంతో పాటు ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా కార్మికుల కొర‌త ట్రాన్స్‌పోర్ట్ వంటి వాటిని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని గుడ్ల ధ‌ర‌ల‌ను పౌల్ట్రీ యాజ‌మానులు పెంచుతున్నారు.

తెలంగాణ‌లో క‌రోనా కంటే ముందు రాష్ట్రంలో రోజుకి నాలుగు కోట్ల గుడ్లు ఉత్ప‌త్తి జ‌రిగేది.ఇందులో కోటి 50 ల‌క్ష‌ల నుంచి రెండు కోట్ల గుడ్ల‌ను తెలంగాణ వ్యాప్తంగా వినియోగించేవారు. క‌రోనా కంటే ముందు హైద‌రాబాద్‌లోనే ప్ర‌తిరోజు 55 నుంచి 60 ల‌క్ష‌ల గుడ్ల వాడ‌కం జ‌రిగేది.మిగిలిన వాటిని ఇత‌ర రాష్ట్రాల‌కు ఎగుమ‌తి చేసేవారు.అయితే క‌రోనా మొద‌టి ద‌శ‌లో మాత్ర గుడ్ల వాడ‌కం భారీగా త‌గ్గిపోయింది. కోడిమాసం, గుడ్లు తింటే క‌రోనా వ‌స్తుంద‌నే ప్ర‌చారం మొద‌టి ద‌శ‌లో జ‌రిగింది.దీంతో ఇటు మాంసంతో పాటు గుడ్ల వినియోగం కూడా త‌గ్గిపోయింది.కానీ రెండ‌వ ద‌శ క‌రోనాలో దానికి భిన్నంగా ఉంది.రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డం కోసం గుడ్ల‌ను తినాల‌ని వైద్యులు చెప్తుండ‌టంతో గుడ్ల‌కు ఇప్పుడు గిరాకీ పెరిగింది.ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా పౌల్ట్రీల ద‌గ్గ‌ర గుడ్ల లారీలు ప‌రుగులుపెడుతున్నాయి. పెద్ద పెద్ద ఫారాల వ‌ద్ద రోజుకి దాదాపుగా 5 నుంచి ప‌ది లారీల గుడ్లు ఎగుమ‌తి అవుతున్నాయి. ఇటు ప‌ల్లెల్లో కూడా కోడిగుడ్ల‌కు డిమాండ్ పెరిగింది.రిటైల్ ధ‌రే 6 నుంచి 7 రూపాయ‌లు ప‌లుకుంది.మొత్తానికి క‌రోనా పుణ్య‌మా అని పౌల్ట్రీ యాజ‌మానులు వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయ‌లుగా కొన‌సాగుతుంది.

అయితే ప్ర‌తి ఒక్క‌రు గుడ్డు తినాలంటూ సినీ న‌టుడు నిర్మాత బండ్ల గ‌ణేష్ ట్వీట్ చేశారు.పౌల్ట్రీ రంగంలో బండ్ల గణేష్ క్రీయాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిర్మాత‌గా కంటే వ్యాపారిగానే ఆయ‌న ఎక్కువ‌గావ్య‌వ‌హ‌రిస్తున్నారు.దీంతో ఆయ‌న కూడా అంద‌రిని గుడ్లు తినండి అంటూ కోరుతున్నారు.










మరింత సమాచారం తెలుసుకోండి: