యంగ్ టైగర్ కెరియర్ లో ది బెస్ట్ మూవీస్ అనగానే ఆ లిస్ట్ లో జై లవకుశ మూవీ తప్పకుండా ఈ సినిమాలో అన్ని అంశాలు సమపాళ్లలో అందించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో బాబీ సక్సెస్ అయ్యాడు. తారక్ మొట్ట మొదటి సారిగా త్రిపాత్రాభినయం చేసిన చిత్రం కావడం మరో విశేషం.  అన్నదమ్ముల మధ్య మొదలైన చిన్ని చిన్ని గొడవలు, చిన్న తనంలో తెలియని వయసులో అనుకోని పరిస్థితుల్లో వారి మధ్య దూరం పెరిగినప్పటికీ ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య  అనుభందం కనబరిచి, ఒకరికోసం ఒకరు ప్రాణం ఇచ్చేంత ప్రేమను వారి నడుమ చూపించిన విధానం ప్రేక్షకుల మనసుకు టచ్ అయింది. సాధారణంగా ప్రతి కుటుంబంలో దాదాపు అందరు అన్నద్ములు ఎక్కువగా గొడవ పడుతుంటారు. ఒకరి నొకరు నొప్పించుకోడం వంటివి చేస్తుంటారు అలాగని వారి మధ్య ప్రేమ అసలు ఉండదు అని కాదు. వారి రక్తంలో దాగి ఉన్న బంధం వారిని ఎప్పుడూ వీడనివ్వదు. 
సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆ ప్రేమ బయట పడుతుంది. ఈ సినిమాలో కూడా మొదట్లో అన్నదమ్ముల మధ్య ఘర్షణలు చూపించినప్పటికీ, చివరికి ఒక అన్నగా తమ్ముళ్లు సంతోషంగా ఉండాలని కోరుకున్న తీరు, అన్న ప్రేమను తెలుసుకుని వారు ప్రవర్తించిన విధంగా ప్రతి ప్రేక్షకుడి కంట కన్నీరు పెట్టించింది.    కష్టనష్టాల్లో కూడా అన్నదమ్ములు ఎలా ఒకరికొకరు అండగా నిలవాలి అన్న పాయింట్ ను బాగా చూపించారు. అదే విధంగా మన అనుకున్న సొంత వాళ్లే మనల్ని తక్కువ చేసి మాట్లాడితే ఎంత బాధ కలుగుతుందో, అది పోను పోను ఎన్ని సమస్యలకు  దారి తీస్తుందో అన్న పాయింట్ ను తెలియచేసిన విధానం అందరికీ నచ్చింది. ఇందులో కామెడీ యాంగిల్ కూడా ఈ సినిమాకి మరో ప్లస్ గా నిలిచింది. ఈ సినిమాకు మరో విశేషం కూడా ఉంది. అన్నదమ్ముల మధ్య బంధాలకు తెలియ చెప్పే కథతో తీఐన సినిమా తీసింది తన అన్న కళ్యాణ్ రామ్.  ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కు కమర్షియల్ గా మంచి ఫలితాన్ని ఇచ్చింది.
ఇక ఈ కథ మొత్తంగా చూస్తే అన్నదమ్ములు మధ్య మొదలయ్యే చిన్న చిన్న గొడవలే రేపు వారి మధ్య దూరాన్ని పెంచవచ్చు. ఆ తర్వాత  వాటిని దాటి  కలుసుకునే సందర్భం రాకపోవచ్చు. కాబట్టి అన్నదమ్ములు మధ్య వచ్చే గొడవలను తల్లితండ్రులు ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వారికి ఎప్పటికప్పుడు బంధాల విలువలు తెలియజేస్తూ వారి మధ్య ప్రేమను పెంచాలి. ఈ విషయాన్ని ప్రతి ఇంట్లో ఉన్న అన్నదమ్ములు మరియు తల్లితండ్రులు గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. అందులో అతి ప్రధానం బంధాలు బంధుత్వాలు. మనిషి బ్రతికున్నంత కాలం బంధాలను కాపాడుకోవాలి. అలాంటి ఎంతోమంది అన్నదమ్ములకు ఈ సినిమా అంకితం. జై లవకుశ.

మరింత సమాచారం తెలుసుకోండి: