1998లో యాక్షన్ డ్రామాగా వచ్చిన అంతఃపురం సినిమాలో జగపతి బాబు, సౌందర్య, ప్రకాష్ రాజ్, సాయి కుమార్, శారదా తదితరులు నటించారు. ఇళయరాజా సంగీత బాణీలు సమకూర్చిన ఈ సినిమాని కృష్ణవంశీ అమెరికన్ ఫిల్మ్ "నాట్ వితౌట్ మై డాటర్(1991)" ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో కత్తులతో నరకడాలు, బాంబులతో చంపడాలు, ఏడుపులు, పెడబొబ్బలు లాంటి అత్యంత ఘోరమైన సన్నివేశాలు ఉంటాయి. ముఠా కక్షల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చివరి వరకు అన్ని వైలెంట్ యాక్షన్ సన్నివేశాలే ఉంటాయి.


అయితే రాయలసీమకి చెందిన శేఖర్( సాయి కుమార్) ఈ ఫ్యాక్షన్ గొడవలు అన్నింటికీ దూరంగా వెళ్ళిపోయి న్యూజిలాండ్ లో నివసిస్తుంటారు. అప్పుడే అతనికి భానుమతి (సౌందర్య) అనే యువతి పరిచయం అవుతుంది. ఆమెను ప్రేమ పెళ్లి చేసుకొని ఓ బిడ్డ కు తండ్రి అవుతారు శేఖర్. తర్వాత తండ్రి కోరిక మేరకు తన భార్యా పిల్లలతో రాయలసీమకు వస్తారు. వచ్చీరాగానే శేఖర్ పై ప్రత్యర్థులు హత్యాయత్నం చేస్తారు. ఆ భయంకరమైన పరిస్థితులను చూసి లబోదిబోమంటూ భానుమతి ఏడుస్తుంది. కొంతకాలం తర్వాత శేఖర్ ఫ్యాషన్ గొడవల్లో చనిపోతారు. దీంతో భానుమతి తన కుమారుడిని కాపాడుకోవాలని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే సారాయి వీర్రాజు ( జగపతి బాబు) తన ప్రాణాలను పణంగా పెట్టి భానుమతి ని రాయలసీమ నుంచి న్యూజిలాండ్ కి వెళ్లేందుకు సహాయపడతారు.



ఇలాంటి ఫ్యాక్షన్ గొడవలతో రూపొందిన అంతఃపురం సినిమాలో ప్రధాన పాత్రలలో నటించిన ప్రతి ఒక్కరు అద్భుతమైన నటనా చాతుర్యాన్ని కనబరిచారు. సౌందర్య, ప్రకాష్ రాజ్, జగపతి బాబు నటనకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే అని అప్పట్లో టాక్ నడిచిందంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రానికి తొమ్మిది నంది అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. డైరెక్టర్ కృష్ణవంశీ తో పాటు సౌందర్య, ప్రకాష్ రాజ్, తెలంగాణ శకుంతల లకు ప్రతిష్టాత్మక సినిమా అవార్డ్స్ లభించాయి. ఇక ఇళయరాజా స్వరపరిచిన "అసలేం గుర్తుకురాదు" పాట ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: