తమిళ సూప‌ర్ స్టార్ అయిన ద‌ళ‌ప‌తి విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న కేవలం తమిళంలోనే ఆగిపోకుండా ఇటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటివరకు ద‌ళ‌ప‌తి విజయ్ కెరీర్‏లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకున్నాడు. సినిమాల‌తోపాటు బిజినెస్, యాడ్స్ తో రెండు చేతులా సంపాదిస్తున్నాడు

అంద‌రూ విజ‌య్‌ను రజినీ కాంత్ వారసుడిగా పొగుడుతుంటారు. గత పదేళ్ల‌లో విజయ్ దాదాపుగా 15 మూవీల్లో న‌టించి మెప్పించాడు. అయితే ఈ సినిమాల్లో దాదాపు తొమ్మిది సినిమాలు రూ. 100 కోట్లకు పైగా షేర్లు వసూలు చేశాయ‌ని స‌మాచారం. అందులో బిగిల్, సర్కార్, మెర్సల్, మాస్టర్ మూవీలు ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్లకు పైగా షేర్ మార్కెట్‌ను దాటేశాయి.



ఇక ఈరోజు జూన్ 22న విజయ్ బ‌ర్త్ డే. కాబ‌ట్టి ఈ సందర్భంగా ఆయ‌న కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం. లోకేష్ కనగరాజ్ డైరెక్ష‌న్ చేసిన మాస్ట‌ర్ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ. 150 కోట్లకు పైగా షేర్ మార్కెట్ వసూలు చేసింది. అలాగే బిగిల్ మూవీ కూడా దాదాపు 100 రోజులు థియేటర్లలో ఆడింది. ఈ సినిమా రూ. 290 కోట్లు షేర్ దాటింది. ఇక మెర్సల్ మూవీ అట్లీ దర్శకత్వంలో తెరకెక్క‌గా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.260 కోట్ల క‌లెక్ష‌న్ సాధించింది.



ఇక సర్కార్ సినిమా ఎఆర్ మురగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ. 250 కోట్లుకుపైగా వసూలు చేసింది. ఇక అట్లీ దర్శకత్వంలో రూపొందిన తేరీ మూవీలో విజయ్ పోలీస్ పాత్రలో మెప్పించాడు. ఇందులో విజయ్ డబుల్ రోల్ లో చేయ‌గా.. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూఈ రూ. 200 కోట్లకు పైగా క‌లెక్ష‌న్లు సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: