టాలీవుడ్ లో హీరోల మధ్య పోటీ బాగానే ఉంటుంది. ఒక హీరో సినిమా హిట్ అయితే మరొక హీరో తన సినిమా కూడా దాని కి మించి హిట్ అయ్యేలా చూసుకుంటాడు. ఒకరిని మించి ఒకరు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. హీరోలు ముఖ్యంగా పాన్ ఇండియ సంస్కృతి మొదలైన తర్వాత ఇలాంటి భావన ప్రతి హీరోలో ఎక్కువగా నెలకొంది.  రెమ్యునరేషన్ నీ బట్టి హీరోల స్టార్డమ్ ను అంచనావేస్తున్నారు ప్రేక్షకులు. ఎవరైతే ఎక్కువ పారితోషకాన్ని అందుకుంటారో వారినే టాలీవుడ్ నెంబర్ వన్ హీరో గా పరిగణిస్తారు. 

అలా చూస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో అందరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ప్రభాస్. టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన టాలీవుడ్ సినిమాలను దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చూసేలా బాహుబలి సినిమా తో చేశాడు ప్రభాస్. ఆ సినిమాతో ప్రభాస్ కు మరో రేంజ్ లెవెల్ పెరిగిపోయింది. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ లో సినిమాల బడ్జెట్ స్థాయిని పెంచిన ఘనత ప్రభాస్ దే.

ఆయన తర్వాత ప్రతి ఒక్క హీరో కూడా పాన్ ఇండియా సినిమా చేస్తూ అన్ని భాషల ప్రేక్షకుల అభిమానాన్ని పొందడానికి ట్రై చేస్తున్నారు. ప్రభాస్ తర్వాత పారితోషికం విషయంలో అయిన, పాన్ ఇండియా సినిమాలు చేయడంలో అయినా,  ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోవడంలో అయినా ఆయనకు గట్టిపోటీ ఎవరి దగ్గర నుంచి వస్తుంది అంటే ఎన్టీఆర్ దగ్గర్నుంచి వస్తుందని తప్పకుండా చెప్పొచ్చు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో, మరియు కొరటాల శివ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు కలిపి దాదాపు 100 కోట్లకు పైగానే ఎన్టీఆర్ జరిగిన దేశం అందుకోబోతున్నారు ఈ లెక్కన చూసుకుంటే ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరో ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: