తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న దిల్‌రాజు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారని తెలుస్తోంది. తాజాగా ఆయన మరొక హిందీ ప్రాజెక్టు అని ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా ఆయన ఒక సినిమా నిర్మించబోతున్నారు. దిల్‌రాజు తెలుగులో అల్లరి నరేష్ హీరోగా నటించిన నాంది సినిమాని హిందీలో రీమేక్ చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి ఆయనతోపాటు అజయ్ దేవగన్ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారు.


అయితే దిల్‌రాజు ఇప్పటికే తెలుగులో సూపర్ హిట్ అయిన జెర్సీ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో క్రికెటర్‌గా షాహిద్ కపూర్ నటిస్తున్నారు. అయితే ఆ చిత్రానికి అల్లు అరవింద్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. తెలుగులో వెంకటేష్ వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేయనున్నారు. ప్రముఖ హిందీ నిర్మాత బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనీస్ బజ్మీ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్రలో అర్జున్ కపూర్ నటించనున్నారట. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సివుంది. దిల్ రాజు, కుల్దీప్ రాథోడ్ కలిసి తెలుగులో వచ్చిన హిట్ సినిమాని హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఆయన పలు సినిమాలను హిందీ లో రీమేక్ చేయడానికి రెడీ అయిపోయారు.



వాస్తవానికి ఆయన గతంలో ‘రెడీ’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. సల్మాన్ ఖాన్, ఆసిన్ జంటగా ఈ చిత్రంలో నటించారు. అంతేకాకుండా, ‘పెళ్ళాం ఊరెళితే’ సినిమాని ‘నో ఎంట్రీ’గా హిందీలో రీమేక్ చేసి విజయం సాధించారు. అయితే ఇటీవల కాలంలో ఆయన బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. దీనిబట్టి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్ గా ఎలా పేరు తెచ్చుకున్నారో హిందీలో కూడా పేరు తెచ్చుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: