విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన "నారప్ప" చిత్రానికి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అయితే ఈ సినిమా U/A సర్టిఫికేట్ అందుకుంది. ఈ సినిమాని చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రుల సమక్షంలో వీక్షించవచ్చని సెన్సార్ బోర్డు "U/A" సర్టిఫికేట్ సమర్పించింది. నారప్ప మూవీ ధనుష్ హీరోగా నటించిన అసురన్ చిత్రానికి రీమేక్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే తెలుగులో ధనుష్ పాత్రను వెంకటేష్ చేశారు. ఆరు నెలల క్రితం విడుదలైన "గ్లింప్స్ ఆఫ్ నారప్ప" వీడియోలో వెంకటేష్ లుక్ ని మనం చూడొచ్చు. అచ్చం ధనుష్ లాగానే వెంకటేష్ పంచె కట్టు కొని.. తలకు గుడ్డ చుట్టుకొని.. కత్తి పట్టుకుని ఉగ్ర అవతారంలో కనిపించారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లు కూడా విడుదలై అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి. అసురన్ చిత్రానికి నారప్ప పర్ఫెక్ట్ రీమేక్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రంలో వెంకటేష్, ప్రియమణి జంటగా నటించారు. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం వెంకటేష్, ప్రియమణి లకు పెద్ద కుమారుడిగా 'మునిఖన్నా' పాత్రలో నటించారు. కెన్ కరుణాస్ చిన్న కుమారుడిగా నటించారు. కెన్ కరుణాస్ ఒరిజినల్ మూవీ "అసురన్" లో చిదంబరం పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు ఈ సినిమాలోని కీలక పాత్రలు పోషించారు.
బ్లాక్ బాస్టర్ హిట్ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రాన్ని డైరెక్ట్ చేసి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల "నారప్ప" చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే తాజా నివేదికల ప్రకారం నారప్ప చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదిక జులై 24వ తేదీన విడుదల కానుందని తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. మరి వెంకటేష్ నారప్ప సినిమాతో ప్రేక్షకులను అలరిస్తారో లేదో చూడాలి.