హీరో నితిన్ ఎలాంటి వివాదాలకు పోకుండా ఎప్పుడూ తన సినిమాలు తను చేసుకుంటూ పోతాడు. కానీ ఆయన ఎవరితో క్లోజ్ గా ఉంటాడో, ఎవరితో మాట్లాడుతారో, ఎవరితోఎక్కువగా తిరుగుతూ ఉంటారు, ఎప్పుడూ ఒక కన్నేసి గమనిస్తూనే ఉంటారు కొంతమంది మీడియా ప్రబుద్ధులు. వీరు ఈ ఒక్క హీరోనే కాకుండా చాలా మంది యంగ్ హీరోలను గమనిస్తూ వారి సీక్రెట్లు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారు ఏ హీరోయిన్ తో అయినా క్లోజ్ గా ఉన్నట్లు కనిపిస్తే వారిద్దరికీ ఎఫైర్ అంటగట్టేస్తారు.

ఆ విధంగానే నితిన్ కు గతం లో నిత్యమీనన్ అనే హీరోయిన్ తో సంబంధం ఉందని పుకార్లు రేపారు. నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది నిత్యామీనన్. తొలి చిత్రం అలా మొదలైంది తోనే తనలో అద్భుతమైన నటి దాగివుందని నిత్యామీనన్ చాటిచెప్పింది. గ్లామర్ షో లు చేయడానికి ఎక్కువగా ఇష్టపడకుండా సాంప్రదాయబద్ధమైన పాత్రలే చేస్తూ ఆమె తెలుగులో హీరోయిన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.  మలయాళంలో, కన్నడ, తమిళ చిత్రాల్లో సైతం కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.

 చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ ఇంగ్లీష్ సినిమా ద్వారా ప్రవేశించిన ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది అనుకున్నారు. కానీ ఆమె వద్దని కూర్చున్న గ్లామర్ షో వల్లనే సినిమా అవకాశాలు రానాట్టుకొలేపోయింది అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈమె కెరీర్ లోనే ఒక పుకారు అత్యంత భాడకరం గా ఉందని ఆమె చాలా సార్లు వెల్లడించింది. అదే హీరో నితిన్ తో ఆమెకు ఎఫైర్ ఉందని సృష్టించడం. తనకు అలాంటి సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పినా నిత్య మాటను ఎవరూ వినిపించుకోలేదు. వీరిద్దరూ కలిసి ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే అనే రెండు సినిమాలను చేశారు. దాంతో వరుసగా రెండు సినిమాలు అమేతోనే చేయడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని సృష్టించారు. కాగా ఈ రెండు సినిమాలు టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: