
ప్రస్తుతం మెహరీన్ కూడా ఇప్పుడు నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందే ప్రేక్షకులకు షాక్ ఇచ్చి, భవ్య భిష్ణోయ్ తో నిశ్చితార్థం చేసుకుని వార్తల్లో నిలిచిన మెహరీన్ , ఆ తర్వాత లాక్ డౌన్, కరోనా మహమ్మారి ఉద్రిక్తత ఎక్కువ కావడంతో వీరు పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఇక లాక్డౌన్ పూర్తవగానే పెళ్లి చేసుకుంటారు అని అనుకున్న సమయంలో నే, ఈమె అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా షాక్ ఇచ్చింది. "ఇక మేమిద్దరం స్నేహపూర్వకంగానే ఎంగేజ్మెంట్ ను బ్రేక్ చేసుకుంటున్నామని".. ప్రకటించింది.
ముఖ్యంగా ఈ విషయాన్ని ఇరు కుటుంబాలకు పెద్దలు చెప్పిమరీ నిశ్చితార్థాన్ని క్యాన్సల్ చేసుకుంటున్నట్లు తెలిపింది మెహరీన్. ఇక అంతే కాదు భవిష్యత్తులో రాబోయే ఇద్దరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది. ఇక భవిష్యత్తులో అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులను కానీ, స్నేహితులని కానీ ఏ విషయం పైన ఎటువంటి సంప్రదింపులు కూడా జరపనని, వారితో శాశ్వతంగా బంధాన్ని తెంచుకుంటున్నానని ఆమె తెలిపింది.
"ఎంగేజ్మెంట్ ను ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాము అనే విషయంపై నేను ఎటువంటి సమాధానాన్ని ఇవ్వదలచి కోవట్లేదు. ఇది నా వ్యక్తిగత నిర్ణయం, ఇక మీరు కూడా నా నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నాను.. అంటూ ఆమె చెప్పుకొచ్చింది.. ఈ విషయం తెలుసుకున్న సినీ ఇండస్ట్రీ వర్గాలు.. మెహరీన్ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటోంది.. కాబట్టి పెళ్లి తర్వాత రాజకీయాల్లో నటించే అవకాశాలు ఉండవు.ఇక ఈ విషయం పైన ఇద్దరిమధ్య వివాదాలు ఏర్పడి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారేమో అని ఊహాగానం వినిపిస్తోంది..
ప్రస్తుతం మెహరిన్ ఎఫ్3 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు సంతోష్ శోభన్ హీరోగా త్వరలో రాబోతున్న మరో చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తోంది.