విచిత్రంగా ఉన్నా ఇది నిజం. టాలీవుడ్ లో వంద రూపాయలు అడ్వాన్స్ తీసుకొని సినిమా ఒప్పుకున్నాడు ఓ దర్శకుడు. ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్ దేశమంతట విస్తరించిన నేపథ్యంలో అడ్వాన్స్ గా కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. 
ఫుల్ రెమ్యునరేషన్ గురించి చెప్పనవసరం లేదు హీరో కంటే ఎక్కువ పారితోషకం డిమాండ్ చేస్తూ తన స్టార్డమ్ ను ఉపయోగించుకుంటున్నారు.  ఇలాంటి పరిస్థితులు టాలీవుడ్ లో ఉన్న నేపథ్యంలో వంద రూపాయలు అడ్వాన్స్ తీసుకోవడం అంటే నిజమేనా అని ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగకమానదు.

విడ్డూరంగా ఉన్నా ఇది నిజం.  దర్శకుడిగా మంచి విజయాలు సొంతం చేసుకున్నారు త్రినాథ రావు నక్కిన. సినిమా చూపిస్త మామ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే వంటి చిత్రాలతో దర్శకుడిగా వరుస హిట్లు సాధించిన ఈయన ఎందుకు 100 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. మేం వయసుకు వచ్చాం సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే వెరైటీ ప్రేమ కథను తెరకెక్కించాడు అనే పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నాడు త్రినాధ రావు. ఆ తర్వాత సినిమా చూపిస్త మామ, నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో నేను లోకల్ సినిమా చేసి వరుస హిట్లు కొట్టి దర్శకుడిగా టాప్ రేంజ్ కి వెళ్ళాడు.

ప్రస్తుతం రవితేజతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ దర్శకుడికి మొదటి నుంచి అడ్వాన్స్ తీసుకోవడం ఇష్టం ఉండదట. కొందరైతే అడ్వాన్స్ తీసుకోమని బలవంతం చేస్తే వారిని నొప్పించకుండా వంద రూపాయలు తీసుకుంటారట. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు త్రినాధ రావు. కథ ఓకే కాకుండా ఆయనకు సినిమాలకు అడ్వాన్సు తీసుకోవడం ఇష్టం ఉండదట. అందుకే వారికి నమ్మకం కలిగించేందుకు మాత్రమే అడ్వాన్స్ తీసుకుంటారట. విడ్డూరంగా ఉన్నా కూడా ఇది చాలా వినూత్నంగా, మంచితనం గా ఉంది అని అంటున్నారు ప్రేక్షకులు. రవితేజ మాత్రమే కాకుండా వెంకటేష్ కోసం కూడా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. మరి వీరిద్దరిలో ఎవరితో ముందుకు వెళతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: