సినిమారంగంలో కొత్త కొత్త వారు వస్తూ ఉండడం సహజం. అందులో కొంతమంది సక్సెస్ అయ్యి ముందుకు సాగుతూ తమ కెరీర్ ను నిలబెట్టుకుంటారు. ఇంకొతమంది సక్సెస్ కాలేక ఆదిలోనే వేణుదిరుగుతారు. ఆ విధంగా టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త రక్తం ఉరకలు వేస్తుంది. యువ హీరోలు దూసుకొస్తున్నారు. వెరైటీ వెరైటీ కథలతో, కొత్త కొత్త నేపథ్యమున్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమా రంగంలో ఎప్పటికప్పుడు కొత్త నీరు రావాల్సిందే లేదంటే పాత నీరు జోరు తతట్టుకోలేము. 

ఒకటి రెండు హిట్లు పడగానే సదరు హీరోలకు గొంతెమ్మ కోరికలు పెరిగిపోతాయి. రెండు ఫ్లాప్ లు పెడితే చాలు మళ్ళీ కళ్ళు నెలకు ఆనేస్తాయి. ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోగా ఉన్న సందీప్ కిషన్, నాగశౌర్య, శర్వానంద్, నాని లాంటి హీరోలు కొత్త హీరోలను చూసి భయపడుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే వీరి సినిమాలు గత కొన్ని రోజులుగా బ్లాక్ అవుతుండడం వారి ఇమేజ్ కు బాడీ లాంగ్వేజ్ కి తగిన సినిమా కథలు రాకపోవడం వారిని ఎంతో కలవర పరుస్తున్నాయి. 

ప్రస్తుతం టాలీవుడ్లో నవీన్ పోలిశెట్టి, సత్యదేవ్ , తేజు సజ్జ, సంతోష్ శోభన్ వంటి వాళ్లు వెరైటీ కథలకు ప్రయోగాత్మక సినిమాలకు ఆప్షన్ లు గా కనిపిస్తున్నారు. ఆ సినిమాలతో హిట్లు కొడుతూ వారు మీడియం రేంజ్ హీరోలుగా మారుతున్నారు. ఈ నేపథ్యం లో కొంత ఇమేజ్ నుండి ప్రయోగాత్మక సినిమాలు చేయలేకపోతున్నా మీడియం రేంజ్ హీరోలకు వీరి ద్వారా ప్రమాదం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మీరు కనుక హీరోలుగా సక్సెస్ అయ్యి అభిమానాన్ని ఏర్పరుచుకుంటే వారి స్థానం గల్లంతు అవుతుందని చెబుతున్నారు. ఏదేమైనా మంచి సినిమాలతో ఆకట్టుకుంటే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది కాబట్టి జాగ్రత్త గా కథల ఎంపిక అనేది అవసరం. 

మరింత సమాచారం తెలుసుకోండి: