
భారత దేశంలోనే అతి పెద్ద సినీ పరిశ్రమ ఆయన బాలీవుడ్ నుంచి ఈ సంవత్సరం వచ్చిన సినిమాలు మంచి ఫలితాన్ని అందుకోలేదు. దాంతో ఒక్కసారిగా బాలీవుడ్ సినీ పరిశ్రమ బిజినెస్ ఎంతో డౌన్ అయింది. దానికి తోడు కరోనా కూడా రావడంతో సినిమాల విడుదల జరగక కోట్ల నష్టం వాటిల్లింది బాలీవుడ్ సినీ పరిశ్రమకు. ఇప్పటి వరకు విడుదలైన సినిమాలు మోస్తరు ఫలితాన్ని అందుకోవడంతో, పెద్ద సినిమాల విడుదలలు ఆగిపోవడంతో దాదాపు 100 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందట.
ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో ప్రేక్షకులను పెద్దగా కనివిందు చేయని సినిమాలు రాగా ద్వితీయార్థంలో వచ్చే సినిమా లు మాత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తాయి అంటున్నారు. అక్షయ్ కుమార్ నటించిన సూర్య వంశీ, బనారస్, 83, గంగు భాయ్, బ్రహ్మస్త్ర, ఆదిపురుష్, లాల్ సింగ్ చద్దా, కే జి ఎఫ్ 2 , రామ్ సేతు, గణపత్, భుజ్, మైదాన్, బచ్చన్ పాండే, rrr వంటి చిత్రాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఇవి ఈ సంవత్సరమే విడుదల అవుతుండటం విశేషం. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ లతో తెరకెక్కిన ఈ సినిమాలు విడుదల తర్వాత బాలీవుడ్ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బాలీవుడ్ సినీ విశ్లేషకులు.
ఇప్పటికే టాలీవుడ్ కోలీవుడ్ వంటి చిన్న సినిమా పరిశ్రమల నుంచి మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. బాలీవుడ్ కి ఎంతో పోటీ గా వారు సినిమా లు చేస్తుండగా బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలు సరిగా ఆడకపోవడం వారిని ఎంతగానో కలవరపరుస్తోంది. ఈ ద్వితీయార్థంలో విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకులను ఎంతో బాగా మెప్పిస్థాయి అని అంటున్నారు. మరి భారతదేశ సినిమా చరిత్రనే మార్చి వేసిన బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను ద్వితీయార్ధంల వచ్చే సినిమాలు ఏమేరకు అలరిస్తాయో చూడాలి