టాలీవుడ్ లో హీరో వడ్డే నవీన్ కు ఎంతో మంచి పేరు ఉంది. ఫ్యామిలీ చిత్రాల హీరోగా ఎంతో పెద్ద పేరు సంపాదించుకున్న వడ్డే నవీన్ హైట్ లో తనను మించిన హీరో లేడు అనే విధంగా ఉండేవాడు. పెళ్లి, లవ్ స్టోరీ, ప్రేమించే మనసు, చాలా బాగుంది, నా ఊపిరి , గోపి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు వడ్డే నవీన్. అయితే మా తరువాత ఆయన నటించిన చాలా చిత్రాలు బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను మెప్పించలేక పోవడంతో ఆయన సినిమాలను క్రమ క్రమంగా తగ్గించుకుంటూ వచ్చాడు.

కోరుకున్న ప్రియుడు అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి ప్రవేశించిన వడ్డే నవీన్ పెళ్లి సినిమాతో రెండో సినిమాతో నే బిగెస్ట్ హిట్ అందుకొని హీరోగా నిలదొక్కుకున్నాడు. తాంబూలాలు, స్నేహితులు, మా బాలాజీ ,చెప్పాలని ఉంది, బాగున్నారా, శత్రువు, చక్రి,  ఆదిలక్ష్మి వంటి చిత్రాలు ఆయనకు భారీ ఫ్లాప్ ను ఇచ్చాయి. దాంతో ఆయన కు సినిమా అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరమైపోయారు. నిర్మాతగా కూడా మూడు సినిమాలకు పనిచేసిన వడ్డే నవీన్ ఆ సినిమాలు ఫ్లాప్ కావడంతో హీరోగా నిర్మాతగా ఫెయిల్ కావడంతో వడ్డే నవీన్ కు సినిమాల పై ఇంట్రెస్ట్ పోయింది. 

పెళ్లి సినిమాతో బెస్ట్ యాక్టర్ గా ఫిలిం పేరు అవార్డు అందుకున్న ఆయన నా ఊపిరి ఈ సినిమాకు నంది అవార్డును గెలుచుకున్నాడు. నటనలో తనను తాను నిరూపించుకున్న వడ్డే నవీన్ కు మంచి సినిమా పడితే మళ్లీ ఫామ్ లోకి వస్తాడు అని చెప్పే ప్రేక్షకులు ఇప్పటికీ లేకపోలేదు. అందుకే కాబోలు ఆయన ఇప్పుడు ఓ సినిమా ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు కానీ ఈ సినిమా ద్వారా తన ఫామ్ లోకి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అందుకే తన గెటప్ ను పూర్తిగా మార్చేస్తున్నాడు.   ఆ కారణంగానే తన గెటప్ ఎక్కడ రివీల్ కాకూడదనే ఇటీవల కాలంలో ఆయన ను ఏ షో కు పిలిచినా ఏ ఇంటర్వ్యూ పిలిచినా హాజరుకావడం లేదని చెబుతున్నారు. ఫ్యామిలీ కథానాయకుడిగా ఉన్న వడ్డే నవీన్ ఇప్పుడు ఏవిధమైన సినిమాలు చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: