శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చిన అపరిచితుడు సినిమా సౌత్ లో క్రియేట్ చేసిన ప్రభంజనం గురించి అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా యావత్ భారతదేశాన్ని ఆకర్షించిన ఈ సినిమా లంచగొండితనం నేపథ్యంలో తెరకెక్కింది. మూడు విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల చేత ఆహా అనిపించుకున్నాడు విక్రమ్. ఈ సినిమాతోనే మరింత క్రేజ్ ను సంపాదించుకును స్టార్ హీరోగా ఎదిగాడు. అప్పటివరకు తమిళనాడు వరకే పరిమితమైపోయిన విక్రమ్ క్రేజ్ దక్షిణాదిన పాకడం మొదలైంది.

వరుసగా ఆయన సినిమాలు తెలుగులో మలయాళంలో కన్నడంలో డబ్ అయ్యి విడుదల కావడం మొదలైంది. ఆ విధంగా ఇప్పుడు సౌత్ మొత్తంలో లో వెరైటీ నటుడుగా విక్రమ్ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. 2005 లో వచ్చిన ఈ చిత్రం సృష్టించిన రికార్డులు ఇప్పటికీ ఏ సినిమా తుడిచి పెట్టలేదని చెప్పాలి. తెలుగులో కూడా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 13 కోట్ల షేర్ వసూలు చేసి డబ్బింగ్ సినిమాలలోనే రికార్డును సృష్టించింది. ఎప్పుడు టీవీ లో ప్రసారమైనా ఈ సినిమాకు భారీ టిఆర్పి రేటింగ్ రావడం విశేషం. 

ప్రస్తుతం ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ హీరోగా శంకర్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. త్వరలోనే పట్టాలు ఎక్కనుంది ఈ సినిమా. ఇకపోతే ఈ అపరిచితుడు అనే టైటిల్ ను ముందుగా హీరో రాజశేఖర్ వాడుకోవాలని చూశారట. నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఒకప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో అపరిచితుడు సినిమా చేయాల్సి ఉంది. అందులో రాజశేఖర్ హీరోగా నటించాలని అనుకున్నాడు. అయితే ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. శ్రీను వైట్ల తన మొదటి సినిమా కంటే ముందుగానే అపరిచితుడు అనే టైటిల్ తో రాజశేఖర్ తో సినిమాను కన్ఫామ్ చేసుకోగా పది శాతం షూటింగ్ అయిపోయిన తర్వాత నిర్మాత
 చేతులెత్తేశాడు. దాంతో ఆ ప్రాజెక్టు మళ్ళీ మొదలు కాలేదు. ఆ విధంగా రాజశేఖర్ మిస్ చేసుకున్న సినిమా టైటిల్ విక్రమ్ హీరోగా అపరిచితుడుగా తెలుగులో ప్రేక్షకుల ముందుకి  వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: