టాలీవుడ్ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభం లో ఉంది. తమ సినిమాలు విడుదల చేయాలా లేదా అన్న సందిగ్దంలో నిర్మాతలు ఉన్నారు. రిస్క్ చేసి విడుదల చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో, రారో అన్న భయం వారిలో నెలకొంది. విడుదల చేయకపోతే జనాలు ఎక్కువగా ఓ టీ టీ లాక్ అలవాటు పడిపోతున్నారు అన్న సందేహం వస్తుంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇంకోవైపు టికెట్ రేట్ల విషయం లో సంగ్దిగ్డత నెలకొనడం తో ఆ విధంగా కొన్ని సినిమాల విడుదలలు ఆగిపోయాయి. ఎటొచ్చీ టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పెద్ద సంక్షోభం ఏర్పడింది. 

అయితే పెద్ద దర్శకులు పెద్ద నిర్మాతలు చేయని సాహసం ముగ్గురు నిర్మాతలు చేస్తున్నారు. వీటి ఫలితాల పైనే మన టాలీవుడ్ సినిమా భవిష్యత్తు ముడిపడి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నెల 30న శుక్రవారం రోజున ఓ మూడు సినిమాలు విడుదల కానున్నాయి. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్య దేవ్ హీరోగా నటించిన తిమ్మరుసు సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్న సత్యదేవ్ ఏ హీరో చేయని విధంగా థియేటర్లలో తన సినిమా విడుదల చేసే సాహసం చేస్తున్నాడు.  చాలా రోజుల తర్వాత థియేటర్ లలో  ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. 

సినిమా మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఈ శుక్రవారం అలరించబోతున్నాయి. తేజ హీరోగా నటించిన ఇష్క్ సినిమా ప్రేక్షకుల ముందుకు జూలై 30న రాబోతుండగా ఈ సినిమాలో ప్రియా వారియర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. జాంబి రెడ్డి తర్వాత ఈ సినిమా తేజ హీరోగా రాబోతుంది. ఇక నరసింహపురం అనే చిన్న సినిమా కూడా థియేటర్లలో విడుదల అవుతుంది. మరి ఈ సినిమా తర్వాత పెద్ద సినిమాల దర్శక నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేస్తారా చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: