సినిమాల నుంచి అయినా, సీరియల్స్ నుంచైనా ప్రమోషన్ కోసం ప్రోమోలను వాడుకోవడం మామూలే. అయితే ప్రమోషన్ కార్యక్రమమే ఓ ఈ టీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్ కు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆ ప్రోమో వల్ల ఏకంగా సీరియల్ టీంకు ఐపీఎస్ నుంచి వార్నింగ్ రావడం సంచలనంగా మారింది. టీవీ సీరియల్ ప్రోమోకు రియల్ లైఫ్ లో ఐపీఎస్ నుంచి వార్నింగ్ రావడంతో సీరియల్ టీంకు షాక్ ఇచ్చింది. అసలు మార్నింగ్ ఎందుకు వచ్చింది? సీరియల్ కథ ఏంటి? ప్రోమోలో అంతగా ఏముంది? అసలు ఆ కథా కమామిషు ? అనే విషయానికి వస్తే...

విజయ్ టీవీలో ప్రసారం కానున్న కొత్త సీరియల్ 'థెండ్రాల్ వంతు ఎన్నై తోడమ్'. ఈ తమిళ సీరియల్ నుండి విడుదలైన కొత్త ప్రోమో ముఖ్యాంశాల్లో నిలిచింది. జులై 25న విడుదల చేసిన ప్రోమో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ప్రోమోలో హీరోయిన్ ను హీరో ఆమె అనుమతి లేకుండా బలవంతంగా వివాహం చేసుకున్నట్లు చూపబడింది. తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా ఆలయం లోపల కొత్తగా పెళ్ళి చేసుకున్న జంటను విదియడానికి హీరో ప్రయత్నిస్తుంటాడు. అతని ప్రయత్నానికి హీరోయిన్ అంతరాయం కలిగిస్తుంది. దీంతో ఆ వ్యక్తి ఆమెను చెంపదెబ్బ కొట్టి, ఆ జంట దేవాలయ దేవత ముందు ఎలా వివాహం చేసుకుందో ఎత్తి చూపుతాడు. ఆ జంట సంబంధాన్ని రద్దు చేయడానికి ఏం అర్హత ఉందని ఆమె అతన్ని అడుగుతుంది. కోపంతో ఉన్న కథానాయకుడు దేవత మెడలో ఉన్న పసుపుతాడు ఆమె మెడలో వేస్తాడు. దేవుడి ముందు తాళి కడితే ను న భార్య అవుతావా ? అని అడుగుతాడు. ఆ హీరోయిన్ కంటతడి పెట్టుకుంటూ అతన్ని అనుసరిస్తుంది. ఈ ప్రోమోలో వేధింపులను హైలెట్ చేయడంపై మండిపడుతూ ఓ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు తిరువళ్లూరు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ వరుణ్ కుమార్ ఐపిఎస్ స్పందిస్తూ అలాంటి చర్యలకు వ్యతిరేకంగా కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. శిక్షలకు సంబంధించిన సుదీర్ఘ జాబితాను ఆయన వెల్లడించారు. ప్రస్తుతం వరుణ్ కుమార్ ట్వీట్ వైరల్ అవుతోంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: