రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ చిత్రంగా మిగిలిపోతుంది చంద్రముఖి సినిమా. హర్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలలో సరికొత్త కోణాన్ని చూపించిన ఈ సినిమా ఇందులో నటించిన నటీనటులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది. ముఖ్యంగా జ్యోతిక, నయనతార లకు సినిమా గొప్ప పేరును తీసుకువచ్చింది. ఈ సినిమాలో జ్యోతిక నటన గురించి మాటల్లో చెప్పలేం. ఆమె నటన ఈ సినిమా హిట్ కావడానికి  ముఖ్య కారణంగా నిలిచింది అని చెప్పవచ్చు. ఇక రజనీకాంత్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నయనతార గ్లామర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో కనువిందు చేసింది. అన్నీ ఈ సినిమా హిట్ కు కారణం అవ్వగా అప్పట్లో ఈ సినిమా సృష్టించిన విషయం అంతా ఇంతా కాదు.

ఇకపోతే ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది ఓ చైల్డ్ ఆర్టిస్ట్. ప్రస్తుతం ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ కాదు సినిమా అవకాశం కోసం చూస్తున్న హీరోయిన్ లా కనిపిస్తుంది. ఈ సినిమాలో అత్తింతోం అనే పాటలో కనిపించేటువంటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ప్రస్తుతం ఎలా ఉందో తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఆమె ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. చిన్నప్పుడు ఎంతో బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది.   ఈమె పేరు ప్రకాశిత.  ప్రస్తుతం చదువు పూర్తి చేసుకుని సినిమాల్లోకి రావడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తుంది.

అందుకు తగ్గట్లుగానే సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సైలెంట్ గా మనకు పరిచయమైన ప్రకాశిత ఫోటోలను సోషల్ మీడియా లో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో హీరోయిన్ గా పరిచయం చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. మరి భవిష్యత్తులో ఈ ముద్దుగుమ్మ ఏ రేంజ్ లో హీరోయిన్ అవుతుందో చూడాలి. చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన చాలామంది నటీమణులు ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు.  వారిలాగానే ఈమె కూడా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: