ఈ పాటలో మన దేశం యొక్క గొప్పతనాన్ని , ఔన్నత్యాన్ని ఎంతగానో వివరించారు. ఈ దేశం మనదే, దేశంలోని వెలుగు మనదే, ఎగురుతున్న జెండా మనదే... అనగా మన స్వేచ్చ....దేశంలో అందరికీ స్వేచ్చ ఉందని తెలియచేస్తూ లిఖించిన ఈ లైన్ ఎంతో అద్బుతం మరియు అర్థవంతం. ఈ పాటలోని ప్రతి పదము దేశంలోని విలువలను, ఐక్యమత్యాన్ని, కులమతాలకు అతీతంగా మన దేశం యొక్క స్ఫూర్తిని తెలియచేస్తూ ఏ కులమైనా, ఏ మతమైనా, రాజైనా, నిరుపేద అయినా భరతమాత దృష్టిలో అందరూ ఒక్కటే. మన మందరం ఆ భరతమాత బిడ్డలమే...అని ఈ పాట ద్వారా తెలియజేసిన భావన ప్రశంసనీయం.
అందాల బంధం పెనవేసుకుంది ఈ భరత భూమిపై , వందేమాతరం అంటూ ఆత్మీయ రాగం కలుపుతుంది దేశ ప్రజలందరినీ, ప్రపంచ దేశాలలో మన దేశం ఎంతో ప్రత్యేకం. ఎన్నో కులాలు, మతాలు, జాతులు అయినా జనగణమన అంటూ అందరినీ ఒకటి చేసే శక్తి నేలకు ఉండటం మన అదృష్టం. తమ తమ మతాలను అనుసరిస్తూనే ఈ గడ్డపై జీవిస్తున్న మిగిలిన అన్ని మతాల వారిని కూడా తమ తోబుట్టువులా భావించి కలిసికట్టుగా వుండటమే దేశభక్తి. ఈ విషయం కరోనా అలన్తి ప్రమాదకర పరిస్థితుల్లో జాతి, మత కులాలకు అతీతంగా స్పందించిన తీరు, మరియు సహాయపడిన విధానమా అమోఘం అని చెప్పాలి. ఇదే విధంగా ఎటువంటి ఆపద వచ్చినా, ప్రమాదం ఎదురైనా అందరం కలిసి నడుద్దాం. ఆఖరిగా భారతీయుడిగా పుట్టినందుకు సలాం చేస్తున్నా...జై హింద్..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి