నిజానికి శ్రీదేవికి చెల్లెలు ఎవరు లేరు. శ్రీలత శ్రీదేవి కి కజిన్ సిస్టర్ అవుతుంది.. కానీ ఈ శ్రీలత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. నిజానికి శ్రీలతకు , శ్రీదేవి అంటే చాలా ఇష్టం. వీరు ఎంతలా కొట్టుకుంటారో అంతే ఆప్యాయతగా ఉండేవారు. వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో అక్కచెల్లెలుగా కూడా నటించారట. ఇకపోతే శ్రీలత ఆ సినిమాలో నేను నటించాలంటే తప్పకుండా నాకు నా కుక్క పిల్లను తెచ్చిస్తే నటిస్తానంటూ కూడా మారాం చేసిందట .ఇక శ్రీదేవి ఎంత చెప్పినా శ్రీలత వినిపించుకోలేదట. చివరికి ఇంటికి కారు ను పంపించి కుక్క పిల్లని తీసుకు వచ్చే వరకు షూటింగ్ ప్రారంభించి లేదట.
ఇక తర్వాత సినిమా షూటింగ్ మొదలైంది. అదే షూటింగ్లో శ్రీలత ను ఒక ఆవిడ ను కొట్టాలి . కానీ ఆమె ముందే రిహార్సల్ చేయకపోవడం వల్ల రెండు సార్లు సీన్ చేయాల్సి వచ్చింది. డైరెక్టర్ కోపంతో ఆమె ను కొట్టడం కూడా రాదా అని గట్టిగా అరవడంతో, ఎదుటి ఆమె శ్రీలత ను కోపంతో గట్టిగా కొట్టిందట. దాంతో పక్కనే ఉన్న శ్రీదేవి కూడా తన చెల్లెలిని కొట్టడంతో బాగా ఏడ్చేసిందట.. ఇంతలా వారిద్దరూ స్నేహంగా ఉండే వారు. ఒకానొక సమయంలో శ్రీలత ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సంజయ్ దత్ అనే అతన్ని ప్రేమించి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది.ఈ విషయాన్ని శ్రీదేవి జీర్ణించుకోలేకపోయింది. పైగా తన అక్క తన ఆస్తిని కొట్టేసిందని శ్రీదేవి పై శ్రీలత కేసు కూడా వేయడం గమనార్హం. అలా దాదాపు 14 సంవత్సరాల పాటు శ్రీదేవి, శ్రీలత కు మధ్య మాటలు లేవు. ఇక బోనీ కపూర్ ద్వారా వీరిద్దరూ కలిసి నప్పటికి, శ్రీదేవి మరణించిన సమయంలో శ్రీలత పక్కనే ఉంది. కానీ శ్రీదేవి మరణం ఎలా సంభవించింది అనే విషయంపై ఆమె ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం కూడా అనేక సందేహాలకు కారణమైంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి