
ఇక ఒకసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి బయటికి వచ్చిన తర్వాత క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగి పోతుందో అందరికీ తెలిసిందే. ఇక ఈ అమ్మడు కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన దర్శనమిచ్చింది. ఇక ఇటీవల కాలంలో అయితే బుల్లితెరపై హల్ చల్ చేస్తుంది అషు రెడ్డి. ఇప్పటికే యాంకర్ అవతారమెత్తి పలు ఛానళ్లలో ఏకంగా తనదైన యాంకరింగ్ తో అదరగొడుతుంది ప్రస్తుతం మా టీవీలో ప్రసారమయ్యే ఒక షోలో యాంకరింగ్ చేస్తోంది. ఇక ఈ టీవీ లో కూడా హ్యాపీ డేస్ అనే ఒక కొత్త కార్యక్రమంలో యాంకరింగ్ చేస్తోంది.
ఇకపోతే ప్రస్తుతం అషు రెడ్డి, రవి కలిసి యాంకరింగ్ చేస్తున్న హ్యాపీ డేస్ అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఇక ఈ ప్రోమోలో అశోక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. రవి నీకో విషయం తెలుసా.. నాకు చాలా సిగ్గేస్తుంది.. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ఎంతో సిగ్గుపడుతుంది అషురెడ్డి. ఇక ఆ తర్వాత వరుడు ఎవరు అని చెబుతుంది అనుకుంటున్న తరుణంలో వెంటనే అందుకున్న యాంకర్ రవి.. అమ్మాయి ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నావ్ అంటూ పంచ్ వేయడంతో అక్కడున్న వారందరూ నవ్వుకుంటారు.