అక్కినేని ఫ్యామిలీ అంటే టాలీవుడ్‌లో ఎప్ప‌టి నుంచో ఉన్న మంచి క్రేజ్ ఉన్న ఫ్యామిలీ. మ‌రీ ముఖ్యంగా కింగ్‌ నాగార్జున సినిమాలంటే ఇప్ప‌టికి కూడా ప్రేక్షకులు ఎంతో ఆద‌రిస్తారు. ఆయన సినిమా వ‌చ్చిందంటే చాలు రికార్డులు సృష్టించాల్సిందే. అయితే ఇప్పుడు వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న ఆనాగార్జున ఇప్పుడు త‌న అభిమానుల కోసం ఓ స‌ర్ ప్రైజ్ ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. కింగ్ నాగార్జున త‌ర్వాత మూవీ అనే యాష్‌ ట్యాగ్‌ తో కొత్త ప్రీ లుక్ మూవీ మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

దీంతో ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కాగా ఇప్పుడు రిలీజ్‌ అయిన ఈ పోస్ట‌ర్ కొత్త మూవీని స్టార్‌ డైరెక్టర్ అయిన ప్రవీణ్‌ సత్తార్ ఎంతో ప్లాన్ వేసి మ‌రీ భారీ బ‌డ్జెత్‌తో తీస్తున్నారు. కాగా ఈ కొత్త మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ పై తీస్తున్నారు. అయితే ఈ బిగ్ మూవీకి శరత్ మ‌రార్ ప్రొడ్యూస‌ర్గా చేస్తున్నారు. అయితే ఇప్పుడు నాగార్జున న‌టిస్తున్న ఈ మూవీలో కాజల్‌ అగర్వాల్ ఆయ‌న స‌ర‌స‌న నటిస్తోంది.

ఇక ఇప్పుడు రిలీజ్‌ చేసిన ఈ పోస్ట‌ర్ ను చూస్తే ఇందులో నాగార్జునకత్తి పట్టుకుని క‌నిపిస్తున్నాడు. అంటే ఈ పోస్ట‌ర్ ను బ‌ట్టి చూస్తుంటే మాత్రం ఈ మూవీ కూడా మంచి మాస్ త‌ర‌హాలో ఉండే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. సేమ్ టు సేమ్ డాన్ మూవీ లాగే ఉంటుందని తెలుస్తోంది. ఇక‌పోతే ఈ మూవీ మరో అప్డేట్ కూడా ఈ పోస్ట‌ర్ లో ఇచ్చేసింది. అదేంటంటే 29 వ తేదీన విడుదల చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చేసింది.

దీంతో అక్కినేని అభిమానులకు డ‌బుల్ బొనాంజా వ‌చ్చేసింద‌ని అంటున్నారు. కాగా ఇప్పుడు ఈ పోస్ట‌ర్ విప‌రీతంగా సోష‌ల్ మీడ‌దియాలో వైర‌ల్ అవుతోంది. అక్కినేని నాగార్జున ఇప్ట‌పికి కూడా ఇంకా గ్లామ‌ర్ గానే క‌నిపిస్తున్నారు. అయితే ఇప్పుడుఈ మూవీ కోసం ఆయ‌న ప్ర‌త్యేక డైట్ ఫాలో అవుతున్నాడ‌ని, ఇందులో మరింత యంగ్ గా క‌నిపించేందుకు ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే అక్కినేని ఫ్యాన్స్‌కు పండ‌గే.

మరింత సమాచారం తెలుసుకోండి: