
1. శ్రీ కృష్ణావతారం :
1967 వ సంవత్సరంలో మాధవపెద్ది గోఖలే తెరకెక్కించిన అద్భుతం పౌరాణిక చిత్రం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ బంధువైన అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మించాడు. ఈ సినిమాలో శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్ చక్కగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు.
2. శ్రీకృష్ణసత్య :
1972 వ సంవత్సరంలో కె వి రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆర్కే బ్రదర్స్ పతాకంపై ఎం త్రివిక్రమరావు నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమాని హిందీ లో అత్యంత ఘనవిజయం సాధించిన తుహి రామ్ తుహి కృష్ణ సినిమా నుంచి రీమేక్ చేసి , తెలుగులో డబ్బింగ్ చేశారు. శ్రీకృష్ణ పాత్రలో ఎన్టీఆర్ నటించి అందరినీ అలరించాడు.
3. శ్రీకృష్ణ తులాభారం:
1966వ సంవత్సరంలో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత రామానాయుడు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రమిది. ఇక ఇందులో ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాత్రలో మెప్పించాడు.
4.దాన వీర శూర కర్ణ :
1977వ సంవత్సరంలో స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమా దానవీరశూరకర్ణ. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనను కనబరిచారు.
5.శ్రీ కృష్ణ పాండవీయం :
1966 వ సంవత్సరంలో తిరిగి మరోసారి శ్రీకృష్ణపాండవీయం అనే సినిమాతో శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించాడు.. నందమూరి తారక రామారావు. ఈ సినిమాకి కూడా ఆయనే దర్శకత్వం వహించడం గమనార్హం.
6. శ్రీకృష్ణ విజయము :
1971 సంవత్సరంలో కమలాకర కామేశ్వర రావు దర్శకత్వం వహించిన , ఈ సినిమాలో కూడా నందమూరి తారక రామారావు శ్రీ కృష్ణుని పాత్రలో నటించి ప్రేక్షకులకు విందు భోజనం తినిపించాడు..
ఇక ఇవే కాదు మరెన్నో సినిమాలలో ఆయన శ్రీకృష్ణుడి పాత్రలో నటించి అలరించడం జరిగింది.