తమన్నా తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న ప్రతినాయక పాత్రను చేయడం దానికి తోడు గా నితిన్ ఆందుడి గా నటించడం ఈ సినిమా పై ఇంత హైప్ రావడానికి కారణం. ఇప్పటివరకు హీరోయిన్ పాత్రలు ప్రత్యేకమైన పాత్రలు ఐటమ్ సాంగులతో తన అందాలను వెదజల్లుతూ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తమన్నా ఒక్కసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
దాదాపు ఆమె కెరియర్ ఎండింగ్ స్టేజ్ కి వచ్చిన నేపథ్యంలో వెబ్ సిరీస్ లు ఆమెను ఇంకా బిజీ గా ఉండేలా చేయగా ఇప్పుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేయడం మొదలు పెట్టడంతో ఆమెకు ఆ తరహా పాత్రలు మరిన్ని వచ్చేలా ఉన్నాయని తెలుస్తుంది. నటనాపరంగా తనను తాను నిరూపించుకావాల్సిన అవసరం లేకపోయినా తమన్నా ఈ తరహా పాత్రల విషయంలో మాత్రం తనను ఎంతగానో నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో తన విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యం గా ఈ సినిమాలో తమన్నా తన గ్లామర్ తో విలనిజాన్ని కలగలిపి ప్రేక్షకులను మై మరిపింప చేసింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో విధులు కంటే ఎక్కువగా తమ నాకే మంచి పేరు వచ్చింది.