ఇక ఈ రెండు సినిమాల తరువాత యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్, అలానే ఆపైన మరొక యువ దర్శకుడు సురేందర్ రెడ్డి తో మరొక సినిమా కూడా చేయనున్నారు. ఇక తన కెరీర్ ని వరుసగా ప్రస్తుతం ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న పవర్ స్టార్, వాటితో మంచి విజయాలు సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే హరీష్ శంకర్ సినిమా తరువాత ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాతగా సురేందర్ రెడ్డి తో తొలిసారిగా పవర్ స్టార్ చేయనున్న సినిమా పై కూడా అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పవర్ స్టార్ కోసం ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేసిన సురేందర్, ప్రస్తుతం దాని స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఎంతో భారీ స్థాయిలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా లో హీరోయిన్ గా ఇప్పటికే పలువురు స్టార్ నటీమణులను పరిశీలించిన దర్శకడు సురేందర్ రెడ్డి ఫైనల్ గా బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ ని ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. గతంలో ప్రభాస్ తో సాహూ సినిమా చేసి మంచి క్రేజ్ అందుకున్న శ్రద్ధ, పవన్ సినిమా స్టోరీ నచ్చడంతో వెంటనే చేయడానికి ఓకె చేసారని సమాచారం .మరి ఇదే కనుక నిజం అయితే తొలిసారిగా పవర్ స్టార్ తో శ్రద్ధ జోడీని వెండితెరపై చూడవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి