1995 వ సంవత్సరం జనవరి 15వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గానే కాకుండా ప్రేక్షకులను కూడా బాగా కట్టిపడేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో రజనీకాంత్ స్టైల్ అబ్బ అనిపించేలా చూపరులను ఇట్టే ఆకట్టుకుంది.. రజనీకాంత్ స్టైల్.. నడక.. మాట తీరు.. ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా విమర్శకులు కూడా ఈ సినిమాను మెచ్చుకున్నారు..ఇక ఈ సినిమాలోని పాపులర్ డైలాగ్ విషయానికి వస్తే..ఈ "బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే".. ఈ డైలాగ్ మొత్తం దక్షిణ భారతదేశాన్ని ఒక వూపు ఊపిందని చెప్పవచ్చు.


145  నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం కలెక్షన్ల పరంగా చూసుకుంటే,  330 మిలియన్ల రూపాయలను సాధించి కమర్షియల్ హిట్ తో పాటు మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. థియేటర్లలో కూడా శతదినోత్సవాలు జరుపుకుంది ఈ చిత్రం. సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల తో పాటు తమిళ ప్రేక్షకులు కూడా మంచి స్టఫ్ ను అందించింది ఈ సినిమా. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను వి. రాజమ్మాల్, వి.తమిళ్ అఝగన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.తమిళంలో విడుదలైన ఈ చిత్రం అత్యంత భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా తెలుగులో కూడా బాషా చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో కలిపి విడుదల చేయడంతో రెండు రాష్ట్రాల్లో కూడా మంచి లాభాలను చేకూర్చి పెట్టింది.


ఈ సినిమాలో హీరోయిన్ గా నగ్మా నటించి అలరించగా, రఘువరన్ విలన్ పాత్రలో రజనీకాంత్ స్టామినాకు తగ్గట్టు గా నటించి బాగా అలరించాడు. ఇకపోతే ఈ సినిమా.. డైలాగ్ కారణంగా కూడా ఈ సినిమాకు హైలెట్ అయిందని చెప్పవచ్చు. 1995లో విడుదలైన ఈ చిత్రం దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు డైలాగుతో ప్రేక్షకులను ఉర్రూతలూగించమే కాకుండా ఈ సినిమా బుల్లితెరపై  ప్రసారమయినా, ఇప్పటికీ కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: