ఈ సంవత్సరం దీపావళి కి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమాను విడుదల చేయబోతున్నారు అని, అలాగే మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న క
ఖిలాడి సినిమాను కూడా దీపావళి బరిలో ఉంచబోతున్నారు అని అనేక వార్తలు బయటకు వచ్చాయి. కాకపోతే ఇప్పటి వరకు ఈ రెండు సినిమాల విడుదల తేదీలను మాత్రం చిత్రబృందం ప్రకటించలేదు. అంత మాత్రాన ఈ సినిమాలు దీపావళి బరిలో ఉండలేవు అని కూడా చెప్పలేము. అయితే ఇప్పటి వరకు తేదీలను ప్రకటించి దీపావళి సందర్భంగా రిలీజ్ కు రెడీ గా ఉన్న సినిమాల గురించి మనం తెలుసుకుందాం.

 
మంచి రోజులు వచ్చాయి : ఏక్ మినీ కథ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్ హీరోగా, అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్ గా టాలీవుడ్ క్రేజీ దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వాస్తవ సంఘటనల ఆధారంగా రొమాంటిక్,  కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. యూవీ కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కి వి సెల్యులాయిడ్ - SKN నిర్మాతలు. ఈ మూవీని నవంబర్ 4వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
అలాగే పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాను కూడా నవంబర్ 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఈ మధ్యే ప్రకటించింది. అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి పూరీ కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించాడు. ఈ సినిమాలో ఆకాశ్ కు జోడీగా కేతిక శర్మ నటించింది. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ - పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ కలిసి ఈ సినిమాను నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: