ఆర్ఎక్స్ 100 సినిమా తీసిన తర్వాత రెండవ సినిమా చేయడానికి అజయ్ భూపతి చాలా కష్టాలు పడ్డాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ దర్శకుడైన మొదటి సినిమా చేయడానికి ఇబ్బందులు పడతాడు.. నిర్మాతల దగ్గరికి తిరుగుతాడు.. హీరో లని ఒప్పించడానికి ట్రై చేస్తాడు. కానీ ఈతన విషయంలో అది రివర్స్ అయ్యింది. ఆయనకు పెద్దగా కష్టపడకుండానే మొదటి సినిమా ఛాన్స్ వచ్చింది. అలా అని దాన్ని సులువు గా తీసుకోలేదు. తొలి సినిమా పై మనసుపెట్టి పనిచేశారు.

ఆ విధంగా ఆర్ఎక్స్ 100 సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చింది. ఆ తరువాత ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా హీరో హీరోయిన్ మరియు దర్శకుడు ముగ్గురు ఫేమస్ అయిపోయారు. దాంతో ఓ పెద్ద హీరో కళ్ళు మూసుకుని అజయ్ కి అవకాశం ఇస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన రెండవ సినిమా విషయం లో మొదటి సినిమా కంటే ఎక్కువగా కష్టపడ్డాడు.

తను తయారు చేసిన మంచి కథకు హీరోలు ఇద్దరు కావాలని చెప్పి చాలా మంది దగ్గరకు తిరిగాడు కానీ ఏదో ఒక కారణం చెప్పి ఈ సినిమా కథను వారు రిజెక్ట్ చేయగా చివరికి శర్వానంద్ మరియు సిద్ధార్థ్సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అందుకే పది సినిమా లు చేస్తే వచ్చే పేరు ఈ సినిమా ద్వారా వీరిద్దరికీ అందరికంటే ఎక్కువగా పేరు వచ్చింది. కథే ఈ సినిమాకి హైలైట్.. కథ వల్లనే ఈ సినిమాలో ప్రతీ పాత్ర కూడా ఎంతో ఎమోషనల్ గా కొనసాగింది. ఇలాంటి నటుడైనా ఈ పాత్రలో ఒదిగి పోతే తారాస్థాయిలో ఎమోషన్ పలికించవచ్చు అలా శర్వానంద్ సిద్ధార్థ్ రావు రమేష్ జగపతి బాబు లాంటి వారు తమదైన నటనతో ప్రేక్షకులను ఆద్యంతం అలరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: