కొంతమంది హీరోలు సినిమాకో స్టైల్ ని పరిచయం చేస్తుంటారు. మరికొంతమంది కొత్త కొత్త డాన్స్‌ ఫామ్స్‌ని ఇంట్రడ్యూస్‌ చేస్తుంటారు. అయితే ప్రభాస్ మాత్రం సినిమాకో బాలీవుడ్‌ బ్యూటీని పరిచయం చేస్తున్నాడు. ముంబయి భామలని హైదరాబాద్‌లో దింపుతున్నాడు. ఇప్పుడు స్పిరిట్‌తో బెబోని తీసుకొస్తున్నాడనే టాక్ వస్తోంది.

దీపిక పదుకొణే బాలీవుడ్‌ నంబర్‌ వన్ హీరోయిన్‌గా మారాక, ఈమె టాలీవుడ్‌కి వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అక్కడ స్టార్స్‌తో సినిమాలు చేస్తోన్న దీపిక తెలుగు సినిమాలకి కాల్షీట్స్‌ ఇస్తుందా అనే సందేహాలు కూడా ఉండేవి. కానీ ప్రభాస్‌ 'ప్రాజెక్ట్‌ కె' కోసం దీపికని ఒప్పించాడు. 'బాహుబలి' ఇమేజ్‌తో ఈమెని తెలుగు సినిమాలోకి తీసుకొచ్చాడు.

ప్రభాస్‌ ఇంతకుముందు శ్రద్ధా కపూర్‌ని కూడా టాలీవుడ్‌కి పట్టుకొచ్చాడు. సుజిత్‌ దర్శకత్వంలో చేసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సాహో'లో శ్రద్ధ హీరోయిన్‌గా చేసింది. ఇక బాలీవుడ్‌ కాంట్రవర్శియల్ క్వీన్‌ కంగన రనౌత్‌ని టాలీవుడ్‌కి తీసుకొచ్చిన ఘనత కూడా ప్రభాస్‌కే దక్కుతుంది. 'ఏక్ నిరంజన్' సినిమాలో ప్రభాస్‌తో జోడీ కట్టింది కంగన.

ప్రభాస్‌ కెరీర్‌లో లాండ్‌మార్క్‌గా నిలుస్తోన్న సినిమా 'స్పిరిట్'. డార్లింగ్‌ 25వ సినిమా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ఆడియన్స్‌లో మంచి బజ్ ఉంది. సందీప్‌ వంగా ప్రభాస్‌ని ఎలా ప్రజెంట్‌ చేస్తాడో అని జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనౌన్స్‌మెంట్‌తోనే అంచనాలు పెంచుకున్న ఈ మూవీలో కరీనా కపూర్ హీరోయిన్‌గా చేస్తుందనే టాక్ వస్తోంది. ఇక ప్రభాస్ 'ఆదిపురుష్' లో కరీనా భర్త సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు.


మొత్తానికి మన ప్రభాస్ బాలీవుడ్ అందాలకు ప్రిఫర్ చేస్తున్నాడు. టాలీవుడ్ అందాల భామలు బోర్ కొట్టారో.. ఏమో గానీ ఉత్తరాది బ్యూటీలను నమ్ముకుంటున్నాడు. ఒక్కో సినిమాకు ఒక్కో హీరోయిన్ ను తీసుకొస్తూ.. చెలరేగిపోతున్నాడు. చూద్దాం.. బాలీవుడ్ భామలు తీసుకొస్తున్న ప్రభాస్.. ఆ ప్రయోగంలో ఏమాత్రం సక్సెస్ అవుతాడో. ఆ బ్యూటీలతో అదృష్టం వరిస్తుందో.. లేదో.
మరింత సమాచారం తెలుసుకోండి: