టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.ఇక ఇటీవల 'అల వైకుంఠపురంలో ' సినిమాతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం బన్నీ పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకోవడానికి శథవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా బన్నీ మెగా ఫ్యామిలీ కి దూరంగా ఉంటూ వస్తున్నాడు. మరోవైపు తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కొత్త వారిని ప్రోత్సహించడంలో ముందు ఉంటున్నాడు బన్నీ. ఇప్పటికే ఎంతో మంది యువ హీరోల ను బన్నీ సపోర్ట్ చేస్తూ వచ్చాడు. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే యంగ్ టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ కి బన్నీ తన వంతు ప్రోత్సాహం అందిస్తూ వస్తున్నాడు.

ఇక తాజాగా మరో యంగ్ హీరో ని కూడా బన్నీ ప్రోత్సహిస్తున్నాడు. అంతేకాదు ఆ టాలెంటెడ్ హీరోకి  శుభాకాంక్షలు తెలియజేశారు బన్నీ. ఆ హీరో మరెవరో కాదు మన మాస్ కా దాస్ విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ హీరోగా రీసెంట్ గా అనౌన్స్ చేసిన సినిమా 'గామి'. ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ పై తాజాగా బన్నీ స్పందించారు.' ఈ ఇంట్రెస్టింగ్ టీజర్ బాగుంది.. మొత్తం టీం కి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. ఇలాంటి యంగ్ అండ్ టాలెంటెడ్ కొత్త ఫిలిం మేకర్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. చిత్ర యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ చేస్తున్నా'అంటూ బన్నీ..

 తన సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఇక బన్నీ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో ఎంతో వైరల్ గా మారుతోంది. ఇక బన్ని ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పార్ట్ 1 డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు...!!


మరింత సమాచారం తెలుసుకోండి: