టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో కూడ తన ఇమేజ్ ని పెంచుకోవాలని గత కొంతకాలంగా పునీత్ రాజ్ కుమార్ ప్రయత్నించాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘యువరత్న’ ను పునీత్ రాజ్ కుమార్ స్వయంగా హైదరాబాద్ వచ్చి ప్రమోట్ చేసినప్పటికీ పెద్దగా తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు.


అయితే పునీత్ తన పట్టు విడవకుండా మరొక భారీ సినిమాలో గెస్ట్ రోల్ లో చేయాలని చేసిన ప్రయత్నం సఫలం కాకుండానే ఆయన మరణించడం దురదృష్టకరం. పునీత్ కు చాల సన్నిహితంగా ఉండే దర్శకుడు మెహర్ రమేష్ చిరంజీవితో తీయబోతున్న ‘భోళాశంకర్’ మూవీలో చిరంజీవి పక్కన అతిధి పాత్రలో నటించాలని ఆశించాడట.


ఈ విషయం మెహర్ రమేష్ కు చెపితే అతడు చిరంజీవితో చెప్పి ఈమూవీ కథలో పునీత్ కు చిరంజీవి పక్కన కనిపించే ఒక కీలకమైన చిన్న పాత్రను క్రియేట్ చేసాడట. ఈమూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కావలసి ఉంది. చిరంజీవి పక్కన నటించడానికి కలలు కంటూనే ఆ కల తీరకుండానే పునీత్ ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోయాడు. ఈవిషయాలు గుర్తుకు తెచ్చుకుని మెహర్ రమేష్ తన బాధను వ్యక్తపరిచాడు.


గూగుల్ లో ఎన్ని వందలసార్లు సర్చ్ చేసినా పునీత్ పై ఒక్క నెగిటివ్ రూమర్ కూడ కనిపించదు అంటే అతడి వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థం అవుతుంది. 26 ఆనాధ ఆశ్రమాలు - 48 పాఠశాలలు - 18 వృద్ధాశ్రమాలు - 19 గోశాలలు 1800 మంది అనాధ పిల్లల దత్తత – మైసూర్ లో శక్తిధామ్ ఆడపిల్లలకు శిక్షణ ఇచ్చే సంస్థ‌ పేరిట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి పునీత్ రాజ్‌కుమార్ మరణించేదాకా ఎవరికీ తెలియదు. ఇచ్చిన దానం ఎవరికీ తెలియకూడదు అని ఆయన ఎప్పుడు చెపుతూ ఉండేవాడట. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో పునీత్ మరణ వార్త విని టాలీవుడ్ శోకసముద్రంలో మునిగిపోయింది..


మరింత సమాచారం తెలుసుకోండి: