హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన అర్చన ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదని తెలుస్తుంది.
గతంలో బిగ్‌బాస్ షోలో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరువయ్యిందని అందరికి తెలుసు.. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తనకు ఎదురైన కొన్ని అనుభవాలను వెల్లడించిందని తెలుస్తుంది.. ఈ సందర్భంగా ఒక తెలుగు డైరెక్టర్ తనను నానా హింసించేవాడని పేర్కొందట.. 'ఒక డైరెక్టర్ ఉన్నాడు. అతడు రోజుకోసారి డైలాగ్ మార్చేస్తాడని , రోజుకోసారి స్క్రిప్ట్ మార్చేస్తాడని చాలా నాన్సెన్స్ చేశాడని అతడిని చూశాక మనుషులు ఇలా కూడా ఉంటారా అనుకున్నానని చెప్పుకొచ్చిందట.
అతడు సెట్లో డిఫరెంట్‌గా ఉండేవాడని చెప్పిందట.. కానీ మళ్లీ ఇదెక్కడ సినిమా వదిలేస్తుందోనని అమ్మా అంటూ నిన్ను కలుస్తా, ఇంటికొచ్చి మాట్లాడతాను అంటూ నాతో మాటలు కలిపేవారని అలా ఒకసారి ఆయన మా ఇంటికొచ్చినప్పుడు మీరు చెప్పింది ఒకటి మళ్ళీ చేస్తుంది మరొకటి అని ఇది కరెక్ట్ కాదు సర్ అని చెప్పానని చెప్పుకొచ్చిందట.దీంతో అతడు కాకమ్మ కబుర్లు చెప్తూ తియ్యగా మాట్లాడుతూ నా బ్రెయిన్ వాష్ చేసేవాడని అతడి మాటలు విని అస్సలు నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో అనుకుని మళ్లీ షూటింగ్‌కు వెళ్లేదాన్నీ అని కానీ సెట్లో చాలా ఇరిటేషన్ వచ్చిందని నువ్వు నాకు పైసా కూడా ఇవ్వకు అని ముఖం మీదే చెప్పి వచ్చేశానని తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పుకొచ్చిందట
ఈ సంఘటన కొన్నేళ్ల క్రితం జరిగిందని చెప్పిందట . అతడు మనందరికీ తెలిసిన హీరో, కానీ పెద్దగా సక్సెస్ఫుల్ హీరో కాదని ఆయన నాకు తెలీకుండా నా వెనకాల కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారని చూడటానికి అతడు చాలా సింపుల్‌గా, సీదాగా ఉన్నారనిపిస్తుందని కానీ అది అతడి నిజస్వరూపం కాదని వేరే నిజం ఇంకేదో ఉంటుందని అతడు చాలా వంకరగా ఆలోచించేవాడని అందమైన అమ్మాయిలు, అందులోనూ ఎవరి అండా లేనివాళ్లు సెట్లో ఉన్నారంటే వాళ్ల మైండ్‌ను క్యాప్చర్ చేసేందుకు ఇలాంటి వ్యక్తులు రెడీగా ఉంటారు' అని చెప్పుకొచ్చిందట అర్చన