ఈ రోజుల్లో అనే ఓ చిన్న
సినిమా ద్వారా ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమయ్యాడు మారుతి. అంతకు ముందు
సినిమా పరిశ్రమలో మేనేజర్ గా ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ ఉండే
మారుతి సడెన్ గా దర్శకుడు కావడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది. అందులోనూ మొదటి సినిమాతోనే ఇంతటి సూపర్ హిట్ అందుకుని దర్శకుడిగా స్థిరపడి పోయాడు. మంచి మంచి కథల తో ప్రేక్షకులను మెప్పించే రచనలతో ఆయన ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేయగా ప్రస్తుతం ఆయన వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ ఉండడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
గోపీచంద్ హీరోగా
మారుతి ప్రస్తుతం పక్కా కమర్షియల్ అనే
సినిమా చేస్తున్నాడు. రాశికన్నా
హీరోయిన్ గా నటిస్తున్న ఈ
సినిమా యొక్క టీజర్ ఈ రోజు విడుదల కాగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. గోపీచంద్ ను సరికొత్త స్టైల్ లో చూపించిన దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాడు మారుతి. ఇదిలా ఉండగా ఆయన తన తదుపరి చిత్రాన్ని
మెగాస్టార్ చిరంజీవి తో చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఇప్పుడు ఒక్కసారిగా
టాలీవుడ్ లో ప్రకంపనలను సృష్టిస్తోంది.
ఆ మధ్య
మెగాస్టార్ చిరంజీవిని కలిసిన
మారుతి ఆయనకు కథ చెప్పి ఒప్పించారని త్వరలోనే వీరిద్దరి కలయికలో ఓ
సినిమా రాబోతుంది అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతే కాదు
విజయ్ దేవరకొండ కు కూడా ఆయన ఓ కథ చెప్పి ఒప్పించారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో
మారుతి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అని అందరూ చర్చించుకున్నారు. అంతే కాదు
ప్రభాస్ తో కూడా ఓ
సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను కొట్టి పారేస్తూ అందరి హీరోలతో పని చేయాలని ఉంది కానీ వారికి తగ్గ కథలు దొరికి వారు సమయం కేటాయిస్తే తప్పకుండా
సినిమా చేస్తానని ఆయన చెప్పడం విశేషం.