రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ఖిలాడి.  రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి లో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వీర అనే సినిమా రాగా ఆ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో రవితేజతో మరొక సినిమా చేసి మంచి హిట్ కొట్టాలని భావించగా ఇన్నాళ్లకు ఈ సినిమా తెరకెక్కుతూ ఉండడం విశేషం. రెండు పాటలు మినహా ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్ మొత్తం పూర్తి కాగా రవితేజ అభిమానులు ఆయనను ఏ విధంగా అయితే చూడాలని అనుకున్నారో అదేవిధంగా చూడబోతున్నారు.

చాలా రోజుల తర్వాత రవితేజ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ రెస్పాన్స్ ను అందుకుంది. రామ్ మిరియాల పాడిన ఈ పాట సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా సినిమా పై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. తాజాగా ఈ సినిమాకు ఫైనాన్స్ ఇబ్బందులు వచ్చాయని ఆ కారణంగానే ఈ సినిమా షూటింగ్ నిలిపివేయబడింది అని వార్తలు రాగా దీనిపై క్లారిటీ ఇచ్చి ఈ సినిమా ఆగిపోలేదు అనే స్పష్టత ఇచ్చింది యూనిట్.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హవిష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రాక్షసుడు సినిమా తర్వాత రమేష్ వర్మ క్రాక్ తర్వాత రవితేజ నటిస్తున్న ఈ చిత్రం ఆ సినిమాల లాగానే సూపర్ హిట్ సినిమా అవుతుందన్న నమ్మకం భావిస్తున్నారు ప్రేక్షకులు. గత వేసవిలోనే ఈ సినిమా రావాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆలస్యమైంది. దాంతో ఈ సినిమా వాయిదా పడుతూ ఇప్పుడు ఫిబ్రవరిలో విడుదల అవడానికి సిద్ధం అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: