ప్రస్తుతం బిగ్ బాస్ 5 తెలుగు రియాలిటీ షో వంద రోజులకు చేరువా అవుతూ ఉండడంతో ఇక బిగ్ బాస్ హౌస్ లో ఆట రసవత్తరంగా మారిపోయింది. 19 మంది కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే ప్రస్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్ కొనసాగుతున్నారు. ఈ కంటెస్టెంట్ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు టాప్ ఫైవ్ లో కి వెళ్తారు అన్నది కూడా ఊహకందని విధంగా మారిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం చూసుకుంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్న వారే మళ్లీ ఫామ్ లోకి వెళుతూ ఉండటం గమనార్హం. ఇక ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్ లలో ఊహకందని విధంగా ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న టాక్ వినిపిస్తోంది. అయితే వచ్చే రెండు మూడు వారాలపాటు గేమ్ లో ఎవరు కచ్చితంగా ఉంటారన్నది మొత్తం ప్రేక్షకులు ఊహించలేక పోతున్నారు. అయితే ప్రస్తుతం అటు సన్నీ దగ్గర మాత్రం ఎవిక్షన్ పాస్ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సన్నీ ఎవిక్షన్ పాస్ తో తన స్నేహితులతో ఎవరినైనా సేవ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో సన్నీ మానస్ కాజల్ లలో ఎవరికోసం ఎవిక్షన్ పాస్ వాడతాడు అన్నది కూడా ప్రస్తుతం అగ్నిపరీక్షగా మారిపోయింది అని చెప్పాలి. అయితే వచ్చే వారం ఎలిమినేషన్ ప్రక్రియలో కాజల్ మానస్ ఇద్దరినీ పెట్టి కూడా ఇక ఎవరికో ఒకరికి ఎవిక్షన్ పాస్ ఉపయోగిస్తావ్ అంటూ బిగ్బాస్ అడిగి  సన్నీ ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. అయితే ఇక సన్నీ ఎవరికి ఎవిక్షన్ పాస్ ఉపయోగించి సేవ్ చెయ్యబోతున్నాడనేది అగ్నిపరీక్ష. ఎందుకంటే ప్రస్తుతం ఎప్పుడు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి అన్నదిఊహకందని విధంగానే మారిపోయింది. అయితే మొన్నటి వరకూ కాజల్ తో పోల్చి చూస్తే మానస్ ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం గత కొన్ని రోజుల నుంచి కాజల్ మానస్ కంటే ఎక్కువ ఓటింగ్ శాతాన్ని పొందుతూ ఉండటం గమనార్హం. ఒకవేళ ఎలిమినేషన్లో మానస్ కాజల్ ఉంటే ఇక మానస్ ఎలాగో సేవ అవుతాడు అని భావించి కాజల్ ను ఎవిక్షన్ పాస్ ఉపయోగించి సేవ్ చేస్తే అప్పుడు మానస్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాఎవిక్షన్ పాస్ విషయంలో సన్నీ తీసుకోబోయే నిర్ణయం మాత్రం అతనికి అగ్ని పరీక్ష లాంటిది అని అంటున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: