హీరో కార్తికేయ తన యాక్టింగ్ చేసిన ఫస్ట్ మూవీ ఆర్ ఎక్స్ 100 తోనే ఘన విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు కార్తికేయ. కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా యాక్ట్ చేశాడు. తాజాగా భారీ అంచనాలతో రాజా విక్రమార్క మూవీ విడుదల అయినప్పటికీ.. ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ టైటిల్ తోనే చిరంజీవి కూడా అప్పట్లో మంచి విజయాన్ని అందు కున్నాడు. ఈ సినిమా కి డైరెక్టర్ సిరిపల్లి తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమా మొదటి భాగం బాగానే ఆకట్టుకుంనప్పటికీ.. సెకండ్ హాఫ్ విషయంలో స్టోరీ ని వదిలేశారని వార్తలు బాగా వినిపించాయి. కాన ఆ ప్రభావము సినిమా కలెక్షన్ల పై పడిందని సమాచారం.

ఇక వీటికి తోడుగా వర్షాలు కూడా రావడంతో ఈ సినిమా ప్రేక్షకులను సరిగ్గా ఆకట్టుకోలేకపోయింది. ఇంతవరకు కార్తికేయ సినిమా కెరియర్ లోనే ఇలాంటి ఘోరమైన ఓపెనింగ్ రాలేదని సమాచారం. ఈ సినిమా కోసం ఎంతో మంది ప్రమోషన్లలో పాల్గొన్నప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర సత్తా చాట లేకపోయింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఎన్ని కోట్లు కలెక్షన్ చేసింది ఇప్పుడు ఒకసారి చూద్దాం..

1).సీ డెడ్:31-లక్షల రూపాయలు.
2).ఉత్తరాంధ్ర: 36 -లక్షల రూపాయలు.
3).ఈస్ట్:23 -లక్షల రూపాయలు.
4).వెస్ట్:-16 -లక్షల రూపాయలు.
5).గుంటూరు: 16 -లక్షల రూపాయలు.
6).కృష్ణా:21-లక్షల రూపాయలు.
7).నెల్లూరు:18- లక్షల రూపాయలు.

8).ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. 2.11 కోట్లు రూపాయలను రాబట్టింది.
9).రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్-22 లక్షలు.
10).ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విష యానికి వస్తే..2.33 కోట్లు రూపాయలను రాబట్టింది.

రాజా విక్రమార్క మూవీ థియేటర్లలో 4.3 కోట్ల రూపాయలు తమ్ముడు పోగా.. ఈ సినిమా 2.33 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక ఈ సినిమా 2.17 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: