సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఎక్కువగా డబ్బు సంపాదించాలని ఈ రంగం వైపు అడుగు పెడుతూ ఉంటారు. అందులో కొంత మంది బాగా సంపాదించుకొన్నప్పటికీ, మరి కొంతమంది పోగొట్టుకుంటూ ఉంటారు. అలా కమెడియన్ నుంచి, హీరోల వరకు ప్రతి ఒక్కరూ డబ్బులు బాగానే సంపాదిస్తూ ఉంటారు. అయితే ఇది ఏ ఇండస్ట్రీలో అయినా సర్వసాధారణం. తాజాగా గోల్డ్ మ్యాన్ గా పేరుపొందిన బప్పి లహరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ మెడలో ఎప్పుడు బంగారాన్ని ధరించి ఉంటారు. ఇక ఈయన ఆస్తి విలువ గురించి ఇప్పుడు ఒక సారి చూద్దాం.

బాలీవుడ్లో ఈయన  సంగీత దర్శకుడిగా ఉన్నారు. నిన్నటి రోజున తన పుట్టిన రోజని ఎంతో సంబరంగా జరుపుకుంటారు బప్పిలహరి. ఇక ఈయన బాగా ఫేమస్ అవ్వడానికి ముఖ్య కారణం ఆయన మెడలో ఉన్న బంగారం హారాలు అని చెప్పవచ్చు. తన సంగీతంతో ప్రేక్షకులను బాగా అలరించాడమే కాకుండా.. అభిమానులను సైతం పోగు చేసుకున్నాడు బప్పిలహరి. ఇక ఈయన సంగీతం ఈయన దగ్గర ఉండే బంగారం కంటే ఎంతో విధ్వంసం సృష్టిస్తున్నాయి.

ఈయన 2014వ సంవత్సరంలో ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఈయన ఆస్తి విలువ తెలియజేయడం జరిగిందట. బప్పి లహరి దగ్గర ఉన్న మొత్తం బంగారం బరువు 752 గ్రాములట..! అంటే దాదాపుగా 65 తులాల బంగారు ఉన్నట్లు. ఇక వీటితో పాటు ఆయన దగ్గర సిల్వర్ కూడా బాగానే ఉన్నది అన్నట్లు సమాచారం. ఈయన దగ్గర మొత్తం 4.62 కేజీల వెండి ఉన్నట్లు సమాచారం.

ఇక ఇక భక్తి లహరిభార్య దగ్గర బంగారు విషయానికి వస్తే..967 గ్రాములు ఉన్నదట.. 85తులాలు అనమాట. ఇక వెండి విషయానికి వస్తే8.9 కేజీలు ఉన్నది. ఇక అంతే కాకుండా వజ్రాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఈయన బంగారం వేసుకోవడానికి ముఖ్య కారణం సెంటిమెంట్ అన్నట్లుగా సమాచారం. ఇక ఈయన ఆస్తి సుమారుగా 250 కోట్లపైనే ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: