చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాలని ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కొంత మంది చిన్నప్పటి నుంచి కూడా కలలుకంటూ ఉండగా.. మరికొంత మంది అవసరాన్ని బట్టి సినిమా ఇండస్ట్రీలోకి వస్తుంటారు. ఇక వారికి వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకుంటారు. ఇండస్ట్రీలో ఆలా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నటి జయవాణి కూడా ఒకరు అని చెప్పడంలో సందేహం లేదు.

 ఆమె ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొని, ఆ తర్వాత ఎక్కువగా విలన్ పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. సినిమాలలో ఫిమేల్ రోల్స్‌లో విలన్ పాత్రలు చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఆమె విలన్ పాత్రలో బాగా నటిస్తూ ప్రేక్షకుల నుండి విమర్శలు అందుకుంటూ ఉండేది. అయితే వాస్తవానికి ఆమెకి ఆ పాత్రలో చేయడం ఇష్టం ఉండేది కాదని.. కొంతమంది దర్శకుల దగ్గరకు వెళ్లి తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయగలనని చెబుతూ వచ్చింది.

అయితే చాలా మంది దర్శకులు తనకు బోల్డ్ సీన్లలో నటించే అవకాశం ఇచ్చినట్లు.. కానీ నో చెప్పకుండా చేశానని అన్నది. ఆమెకి చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఉన్న పిచ్చి కారణంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని, అందుకు తన తండ్రి బాగా సపోర్ట్ చేశాడని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. సినిమాలు అంటే ఎక్కువ పిచ్చి ఉండడంతో, తన సొంత మావయ్య అయిన గుమ్మడి చంద్రశేఖరరావుకి ఇచ్చి పదవ తరగతిలోనే అంటే 13 ఏళ్ళ వయసులోనే పెళ్లి చేశారని చెప్పుకొచ్చింది. ఆమె తన భర్త సహకారంతో పెళ్లి అయ్యాక బీఏ పూర్తి చేసిందట. తన భర్త సినిమాల విషయంలో తనకు ఎలాంటి కండిషన్లు పెట్టలేదని ఆమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: