టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున నాగచైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా 'బంగార్రాజు'. గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా కి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది. కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ విడుదలై ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. అయితే ఇదిలా ఉంటే ఈ సినిమా కథ ఇదే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి.ఇండ్రస్ట్రీ వర్గాల కథనం ప్రకారం.. ఈ సినిమాలో ఇద్దరు బంగార్రాజులు ఉంటారట. మొదటి బంగార్రాజు నాగార్జున. ఆయన చనిపోయి స్వర్గం లో ఉంటాడట.

ఇక స్వర్గంలో ఉండే బంగార్రాజు మనవడే మరో బంగార్రాజు మన నాగచైతన్య. తల్లిదండ్రులు లేని బంగార్రాజు ఆలనా పాలనా చూసుకునే వారు లేక అతను ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి అదే గ్రామానికి చెందిన ఓ పొలిటికల్ లీడర్ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే దారిలో పడతాడని స్వర్గంలో ఉన్న బంగారు రాజు ఆయన భార్య అనుకుంటారు. అందుకు వారు ఇద్దరు ఏం చేశారు. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టించారు. స్వర్గం నుండి భూమి మీదకు వచ్చిన బంగార్రాజు చేసిన రాసలీలలు ఏంటి.. అనేది చాలా రొమాంటిక్ అండ్ కామెడీ గా దర్శకుడు చూపించనున్నాడట. 

అయితే బంగార్రాజు కథ ఇదే నంటూ సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఈ కథ చాలా బాగుందని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే సినిమా కూడా చాలా బాగుంటుందని ఈ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక గతంలో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమా కంటే మించి ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో నాగార్జునకి జోడిగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగచైతన్య సరసన కృతి శెట్టి కనిపించనుంది. ఇక సినిమాలో మరికొంతమంది హీరోయిన్లు కూడా కనిపించనున్నట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో జీ స్టూడియోస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: