సైరా నర సింహా రెడ్డి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తోనే మెగాస్టార్ చిరంజీవి డైరక్టర్ కొరటాల శివ కాంబోలో ఆచార్య సెట్స్ మీదకు వెళ్లింది. అసలైతే ఈ ఇయర్ సమ్మర్ రిలీజ్ అనుకున్నా కరోనా వల్ల షూటింగ్ పూర్తికాక వాయిదా పడ్డది. ఈమధ్యనే సినిమా అంతా పూర్తి చేసి రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు చిత్రయూనిట్. 2022 ఫిబ్రవరి 4న ఆచార్య రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు.

సినిమాలో చిరుతో పాటుగా తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా నటిస్తున్నాడు. సిద్ధ పాత్రలో చరణ్ ఉన్న సన్నివేశాలు అన్ని సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తాయని అంటున్నారు. అయితే ఇదంతా బాగుంది కాని ఆల్రెడీ సినిమా షూటింగ్ పూర్తయి ఫైనల్ కాపీ సిద్ధం చేసే టైం లో ఆచార్య మళ్లీ రీ షూట్ అంటున్నారు. చిరు సలహా మేరకు రిలీజ్ టైం ఉంది కాబట్టి సినిమాలో కొన్ని సన్నివేశాలు మళ్లీ రీ షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా ఆచార్య కోసం వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ షూటింగ్ ఉంటుందని తెలుస్తుంది.

కొరటాల శివ మరోసారి తన పెన్ పవర్ ఏంటో ఆచార్యతో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఆచార్య తప్పకుండా అతని కెరియర్ లో మరో సూపర్ హిట్ అయ్యేలా ఉంటుందని తెలుస్తుంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ మెగా మూవీ ఆచార్య లో కాజల్ అగర్వాల్ తో పాటుగా బుట్ట బొమ్మ పూజా హెగ్దే కూడా నటించారు. సినిమా తప్పకుండా మెగా ఫ్యాన్స్ అందరు పండుగ చేసుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ రీ షూట్ లకు సంబందించిన విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. రిలీజ్ కు ముందు ఇలాంటి వార్తలు కామనే. అయితే ఆచార్య విషయంలో ఇది నిజమా కాదా అన్నది మాత్రం మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: