ప్రస్తుతం కూడా ఎక్కువగా బన్నీ అనే పిలుస్తున్నారు కూడా. గంగోత్రి నుంచి పుష్ప వరకు అల్లుఅర్జున్ తీసిన సినిమాలలో రెండు మూడు మినహా మిగతా సినిమాలు అన్నీ హిట్‌నే సాధించాయి. తెలుగు ఇండస్ట్రీలో తొలి సినిమాతోనే హిట్ సాధించుకుని తనకంటూ ఓ మార్కెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే స్వభావం కలిగిన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటు తెలుగుతో పాటు మళయాళంలో కూడా అల్లు అర్జున్‌కు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు.
తాజాగా అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన చిత్రం పుష్ప ది రైజ్ మంచి విజయాన్ని అందుకున్నది. సినిమా ప్రారంభం రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.50కోట్లు కోట్లు వసూలు చేసి రికార్డునే సృష్టించింది. డిసెంబర్ 17న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తెలంగాణలో డిసెంబర్ 30 వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు సినిమా టికెట్ల ధరలను కూడా పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.25 కోట్ల షేర్ వసూలు చేసిన పుష్ప.. తమిళనాడులో 4.06, కర్నాటకలో రూ.3.75 కోట్ల షేర్.. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కలిపి మరొక రూ.13 కోట్లు వసూలు చేసినది. మొత్తానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్లు వసూలు చేసింది. కేవలం నైజాంలోనే నైజాంలో రూ. 11.45 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించినది. ఈ వారంలో బాక్స్ ఆఫీస్ వద్ద ఆ హీరో బొమ్మ దద్దరిల్లి పోతుంది. మరోవైపు ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో కూడా బన్నీ సినిమాకు ధరలను పెంచుకునేందుకు ఆ జిల్లా కలెక్టర్ అనుమతిచ్చారు. ఇక ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. పుష్ప కలెక్షన్‌లు వసూలు చేస్తూ.. ఈ వారం అల్లుఅర్జున్ స్టార్ హీరోగా సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి