న్యాచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగ రాయ్.  డైరెక్టర్ రాహుల్‌ సాంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా విడుదలై హిట్ టాక్ తో మారు మ్రోగుతోంది. సాధారణంగా ఒక స్టార్ హీరో చిత్రం రిలీజ్ అయింది అంటే  ఆ సినిమా ఎంత వసూళ్లు సాధించింది అనే టాపిక్ వైరల్ గా మారుతుందన్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో నాని చిత్రం  `శ్యామ్ సింగరాయ్‌` బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో  కలెక్షన్లు రాబడుతోంది అన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. రిలీజ్ అయిన మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 7 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఇపుడు ఈ చిత్రం రెండవ రోజున బాక్సాఫీస్ బరిలో అంతకు మించి దూకుడు చూపెడుతోంది. మొదటి రోజు కలెక్షన్స్ కు మించి రెండవ రోజు వసూళ్లు జరిగాయని సమాచారం. ఈ రెండు రోజుల్లో మొత్తం కలిపి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 12.81 కోట్లు దాటేసాయని తెలుస్తుండగా, మరో రూ. 9.69 కోట్ల షేర్ గ్రాస్ ని అకౌంట్ లో వేస్తే ఇక ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్లే. ఇక ఈ సినిమాకు సంబంధించి రానున్న రోజుల్లో కలెక్షన్ లు మరింత ఊపందుకోనున్నాయని టాక్ వినిపిస్తున్న తరుణంలో ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవడం ఖాయం అంటున్నారు.

ఈ మధ్య కాలంలో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో నానికి శ్యామ్ సింగరాయ్ మూవీ బాగా కలిసొచ్చిందనే  చెప్పాలి. ఇదే విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద తన దూకుడి చూపిస్తే ఈ సంవత్సరాంతంలో మంచి విజయాన్ని టాలీవుడ్ అందించిన వాడవుతాడు. ఇప్పటికే పుష్ప బ్రేక్ ఈవెన్ కోసం ఆపసోపాలు అపడుతున్న తరుణంలో నాని సినిమా జోరు బన్నీ కలెక్షన్ లకు దెబ్బేస్తుందని పక్కాగా తెలుస్తోంది. అయితే ఏమి జరుగుతుందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు ట్రేడ్ వర్గాలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: