నాని నటించిన శ్యామ్ సింగరాయ్ కమర్షియల్ గా విజయం సాధించింది. 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా నాని ఈ సినిమా నిర్మాతలకు 5 కోట్ల రూపాయల పారితోషికం తిరిగి వెనక్కు ఇచ్చేశారని సమాచారం.
శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడట నాని.కొన్నేళ్ల క్రితం డ్యూయల్ రోల్ లో నటించి అనుకున్న స్థాయిలో విజయం సాధించని జెండాపై కపిరాజు సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించారు. సినిమాలో మనం ఎంత సమయం కనిపించామనేది అవసరం లేదని మన పాత్ర ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనేది మాత్రమే ముఖ్యమని నాని చెప్పుకొచ్చారట..
జెండాపై కపిరాజు సినిమాలో తాను డ్యూయల్ రోల్ లో నటించానని ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డానని కాళ్లు కూడా విరగ్గొట్టుకున్నానని ఆ సినిమాలో తాను ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఉంటానని నాని వెల్లడించారట. అయితే ఆ సినిమాను ఎవరూ చూడలేదని ఆ సినిమా వల్ల తనకు పెద్దగా పేరు కూడా రాలేదని నాని పేర్కొన్నారట.ఈగ సినిమాలో తాను అరగంట మాత్రమే ఉంటానని ఈగ వల్ల తనకు ఇతర రాష్ట్రాల్లో కూడా గుర్తింపు దక్కిందని నాని పేర్కొన్నట్లు సమాచారం.
కోస్టార్ బెటర్ గా నటిస్తే మనం కూడా బాగా నటించడం సాధ్యమవుతుందని నాని చెప్పుకొచ్చారట.శ్యామ్ మరియు రోజీ కాంబినేషన్ సీన్లు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయని ఆ సీన్లు మరింత ఎక్కువగా ఉంటే ఇంకా బాగుండేదని ప్రేక్షకులు భావించారని నాని పేర్కొన్నారట.నాని ప్రస్తుతం నటిస్తున్న అంటే సుందరానికి! సినిమా వేసవి కి విడుదల కానున్నట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి