అయితే థియేటర్లలో ఇప్పటికీ పుష్ప మేనియా కొనసాగుతూనే ఉంది. ఇంకా పలు ప్రాంతాలలో భారీగా వసూళ్లు వస్తున్నాయి. అయితే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు అల్లు అర్జున్ పుష్ప సినిమా చూస్తూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండటం గమనార్హం. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు పుష్ప సినిమా గురించి స్పందిస్తూ బన్నీ నటన పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాతో కొత్త ప్రపంచాన్ని సృష్టించారని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు మహేష్ బాబు. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాపై సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.
ఇటీవలే రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా పుష్ప సినిమాపై స్పందించారు. ఇండస్ట్రీలో పెద్ద సినిమాగా విడుదలైన అంతిమ్, సత్యమేవ జయతే 2, 83 లాంటి సినిమాల తర్వాత ప్రాంతీయ సినిమా గా తెరకెక్కిన పుష్ప ను జాతీయ సినిమా స్థాయికి తీసుకెళ్లి తెలుగు సినిమా గౌరవాన్ని పెంచారు మీకు అభినందనలు అల్లు అర్జున్ అంటూ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇక ఆర్జివి లాంటి సెన్సేషనల్ దర్శకుడు ప్రశంసలు కురిపించడంతో ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానులు అందరూ కూడా మురిసిపోతున్నారు అని చెప్పాలి. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పెట్టిన ట్వీట్ కాస్త వైరల్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి